logo

‘ఎన్నికల కోడ్‌’ ప్రతిపక్షాలకేనా..? : తెదేపా

సార్వత్రిక ఎన్నికల కోడ్‌ అమలు విధానం ప్రతిపక్షాలకే వరిస్తుందా..?, అధికార పార్టీకి వర్తించదా..? అని జీవీఎంసీ 40, 63వ వార్డుల తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జి ఆర్‌ఆర్‌.రాజు ధ్వజమెత్తారు.

Published : 13 Apr 2024 03:44 IST

మల్కాపురం, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల కోడ్‌ అమలు విధానం ప్రతిపక్షాలకే వరిస్తుందా..?, అధికార పార్టీకి వర్తించదా..? అని జీవీఎంసీ 40, 63వ వార్డుల తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జి ఆర్‌ఆర్‌.రాజు ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ... ‘జీవీఎంసీ 63వ వార్డు జైఆంధ్రకాలనీలో ఈనెల ఒకటిన గీతం ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం ఏర్పాటు చేయగా....డీటీ నాగలక్ష్మి స్పందించి, శిబిరం ఏర్పాటుపై స్థానిక తెదేపా నాయకుల్ని ప్రశ్నించారు. శిబిరానికి, తెదేపాకు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇవ్వడంతో ఆమె శాంతించారు. ఈనెల 11న 62వ వార్డులో ఆడారి తులసీరావు ఛారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరంలో  వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్‌కుమార్‌ తరఫున ఎన్నికల ప్రచారం చేస్తున్న ఆయన సోదరి రమాకుమారి, వార్డు కార్పొరేటర్‌, నాయకులు పాల్గొన్నా.. డీటీ స్పందించలేదు. ఇదే అంశంపై శుక్రవారం డీటీకి ఫిర్యాదు చేయగా..శిబిరం ముగిసిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోలేమంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. కొందరు అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా పని చేయడం దారుణం’ అని రాజు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని