logo

జనసేనలోకి వలసల వెల్లువ

జనసేనలోకి వలసల వరద కొనసాగుతోంది. అచ్యుతాపురం మండలంలో మెజార్టీ గ్రామాల నుంచి వైకాపా నాయకులు జనసేనలోకి చేరగా ఇప్పుడు రాంబిల్లి మండలం వంతు వచ్చింది.

Published : 13 Apr 2024 03:47 IST

అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల నుంచి భారీగా చేరికలు

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: జనసేనలోకి వలసల వరద కొనసాగుతోంది. అచ్యుతాపురం మండలంలో మెజార్టీ గ్రామాల నుంచి వైకాపా నాయకులు జనసేనలోకి చేరగా ఇప్పుడు రాంబిల్లి మండలం వంతు వచ్చింది. కొత్తూరు గ్రామానికి చెందిన వైకాపా ఎంపీటీసీ సభ్యుడు సేనాపతి సన్యాసిరావు, దిమిలి సీనియర్‌ వైకాపా నాయకుడు నగిరెడ్డి వెంకటరమణ జనసేనలోకి చేరారు. అచ్యుతాపురం మండలకేంద్రంలో మోసయ్యపేటకు చెందిన మాజీ సర్పంచి ఈగల అప్పలనాయుడు నాయకత్వంలో వందల మంది వైకాపాకు రాజీనామా చేసి జనసేన కండువా వేసుకున్నారు. ఈ నాయకులను గుండెల్లో పెట్టుకుంటానని వీరికి జనసేన అభ్యర్థి సుందరపు విజయ్‌కుమార్‌ భరోసా కల్పించారు. అవినీతిపరులను ఓడించడానికి అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. నిరంకుశ పాలన చేస్తున్న సీఎం జగన్‌, ఎమ్మెల్యే కన్నబాబురాజును ఇంటికి పంపించే వరకు నిద్రపోకుండా కూటమి విజయానికి కృషి చేస్తామని పార్టీలోకి చేరిన వారు ప్రకటించారు. తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డ్రీమ్స్‌ నాయుడు, డీఎస్‌ఎన్‌ బుజ్జి, బొడ్డేడ భాస్కరరావు, జనసేన మండల అధ్యక్షులు బైలపూడి రాందాసు, జడ్పీటీసీ మాజీ సభ్యులు జనపరెడ్డి శ్రీనివాసరావు, శరగడం నాగార్జున, కరెడ్ల ప్రకాశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని