logo

అర్హులందరికీ కేంద్ర పథకాలు అందిస్తాం

కూటమి ప్రభుత్వం అధికారంలోకి  రాగానే కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందిస్తామని కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌ పేర్కొన్నారు.

Published : 13 Apr 2024 03:48 IST

లక్ష్మీదేవిపేట (అనకాపల్లి), న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం అధికారంలోకి  రాగానే కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందిస్తామని కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌ పేర్కొన్నారు. అక్కిరెడ్డిపాలెంలో కూటమి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాగునీటి పథకాలను నిర్మించి గ్రామస్థుల దాహార్తిని తీర్చుతామన్నారు. జల్‌జీవన్‌ మిషన్‌ ద్వారా ప్రతి ఇంటికీ తాగునీరు అందిస్తామన్నారు. ఓటుతో దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందన్నారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లేకుండా మార్చిందన్నారు. మంత్రి అమర్‌నాథ్‌ ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదన్నారు. జైల్లో ఉండాల్సిన ఖైదీలు పరిపాలన సాగిస్తే రాష్ట్రాన్ని దోచుకుంటారే తప్ప అభివృద్ధి చేయరన్నారు. పిల్లల బంగారు భవిష్యత్తుకు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలన్నారు. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ అధికారంలోకి రాగానే ఉన్నత పాఠశాల చుట్టూ ప్రహరీ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం సర్పంచి సాలాపు శాంతి, సూరి అప్పారావు, కూటమి నాయకులు రామకృష్ణ, సీఎం రమేశ్‌, పీలా గోవింద సత్యనారాయణను గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచి శీరంశెట్టి అప్పలరాజు, నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని