logo

మద్యంతో గెలవాలని చూస్తున్నారు: తెదేపా

ఓటర్లకు యథేచ్ఛగా మద్యాన్ని పంచి గెలవాలని వైకాపా చూస్తోందని తెదేపా విశాఖ లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షులు గండిబాబ్జీ ధ్వజమెత్తారు.

Published : 13 Apr 2024 03:49 IST

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: ఓటర్లకు యథేచ్ఛగా మద్యాన్ని పంచి గెలవాలని వైకాపా చూస్తోందని తెదేపా విశాఖ లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షులు గండిబాబ్జీ ధ్వజమెత్తారు. శుక్రవారం మధ్యాహ్నం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. వైకాపాకు అనుకూలంగా వ్యహరిస్తున్న ఏపీ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ వాసుదేవరెడ్డిని తక్షణం పదవి నుంచి తప్పించాలని డిమాండ్‌ చేశారు. జీవీఎంసీ యూసీడీ పీడీ పాపునాయుడు ఆర్‌పీలను వైకాపా అభ్యర్థులకు మద్దతుగా ప్రచారానికి పంపుతున్నారని ఆరోపించారు. ఆయన రెండు నెలల క్రితం బదిలీ కాగా, ఓ మంత్రి బంధువు కావడంతో తిరిగి విశాఖ వచ్చారన్నారు. తక్షణమే పాపునాయుడును బదిలీ చేయాలని బాబ్జీ డిమాండ్‌ చేశారు. భాజపా అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు మాట్లాడుతూ ఓట్లను కొనుగోలు చేసి గెలవాలనే ఆలోచనలో వైకాపా ఉందన్నారు. రెండు నెలల ముందే మద్యం, నగదును నియోజకవర్గాలకు తరలించిందన్నారు. దక్షిణ నియోజకవర్గ జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్‌, భాజపా జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీంద్రరెడ్డి, తెదేపా విశాఖ లోక్‌సభ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పొలమరశెట్టి శ్రీనివాసరావు, న్యాయ విభాగ అధ్యక్షుడు బత్తి రాజశేఖర్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని