logo

‘చెత్త’పాలనలో ఇంతే!!

ఊహించని స్థాయిలో అభివృద్ధి జరగాలని, ప్రభుత్వం అలా పని చేయాలని ప్రజలు ఆశిస్తారు. వైకాపా ప్రభుత్వం మాత్రం భిన్నంగా పాలించింది. జనమెవరూఊహించని రీతిలో ‘చెత్త’ సేకరణ పన్ను విధించింది.

Published : 13 Apr 2024 04:03 IST

ప్రతి ఇంటిపై బాదుడే
ఎవరినీ వదలని వైకాపా ప్రభుత్వం
ఈనాడు-విశాఖపట్నం, న్యూస్‌టుడే, కార్పొరేషన్‌

ఊహించని స్థాయిలో అభివృద్ధి జరగాలని, ప్రభుత్వం అలా పని చేయాలని ప్రజలు ఆశిస్తారు. వైకాపా ప్రభుత్వం మాత్రం భిన్నంగా పాలించింది. జనమెవరూ ఊహించని రీతిలో ‘చెత్త’ సేకరణ పన్ను విధించింది.


వైకాపా పాలనలో ‘బాదుడు’ ఎలా ఉంటుందో ‘చెత్త సేకరణ పన్ను’ రూపంలో చూపించింది. కట్టని వారికి ఓ దశలో సచివాలయ ఉద్యోగుల ద్వారా హెచ్చరికలు కూడా రావడం గమనార్హం. ఆ స్థాయిలో ఉక్కిరిబిక్కిరి చేసిన జగన్‌ పాలనపై మండిపడుతున్న జనం... రాబోయే ఎన్నికల్లో సరైన తీర్పు ఇచ్చేందుకు ఎదురుచూస్తున్నారు.


 

వేధింపులూ తప్పలేదు..

2021 జూన్‌ నుంచి చెత్త ఛార్జీల వసూలుకు వైకాపా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం ఉత్తర్వుల రూపంలో విడుదల చేసింది. నగరంలో మురికి   వాడల్లో ఒక్కో ఇంటి నుంచి నెలకు రూ.60, మిగతా ప్రాంతాల నుంచి రూ.120 వసూలు చేయాలని నిర్ణయించింది. ఇలా విశాఖ నగరంలో గృహాల యజమానులపై ఏటా రూ.105 కోట్ల భారం మోపింది. ఈ  పన్నుపై వ్యతిరేకత వచ్చినా వెనక్కి తగ్గలేదు. కొందరు ఇంటి యజమానుల పింఛన్ల సొమ్ములోంచి కూడా పన్ను కట్టించారు. కట్టని వారి ఇళ్లు, దుకాణాల ముందు చెత్తను వేసి వేధింపులకు గురి చేసిన ఘటనలూ లేకపోలేదు.

మురికి వాడల్లోనూ అధికమే..

సాధారణంగా మురికివాడల్లోని నివాసితులు ఏడాదికి రూ.300 వరకు గతంలో పన్ను రూపంలో చెల్లించేవారు. ప్రస్తుతం వీరు  నెలకు రూ.60 చొప్పున ఏడాదికి చెత్త ఛార్జీలే రూ.720 చెల్లిస్తున్నారు. మహా విశాఖ నగరపాలక సంస్థ పరిధిలో 6,73,632 గృహాల నుంచి నెలకు రూ.60 చొప్పున రూ.4,04,17,920, మిగతా 3,97,006 గృహాల నుంచి రూ.120 చొప్పున రూ.4,76,40,720... ఇలా మొత్తం రూ.8,80,58,640 జీవీఎంసీ వసూలు చేస్తోంది.


రూ. 165 కోట్ల ‘చెత్త సేకరణ’ పన్ను భారంపై జనాగ్రహం

తీర్మానం తుస్‌..

స్తి పన్నులో చెత్త ఛార్జీల కోసం ప్రత్యేక  కేటాయింపు లున్నా..ఈ విధంగా మళ్లీ వసూలు చేయడాన్ని నగరవాసులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో తెల్ల రేషన్‌కార్డులున్నవారి నుంచి నెలకు రూ.20 నుంచి రూ.30 వసూలు చేయాలని కౌన్సిల్‌ తీర్మానం చేసి ప్రభుత్వానికి నివేదించింది. ఆయా ప్రతిపాదనలను ప్రభుత్వం పక్కనపెట్టింది. దీంతో జీవీఎంసీలో వైకాపా కార్పొరేటర్ల పాలక వర్గం చేసిన తీర్మానం తుస్‌మంది. దీంతో నగరవాసుల నుంచి యథాతథంగా ముక్కుపిండి చెత్త పన్ను వసూలు చేస్తున్నారు.


వాణిజ్య సముదాయాలు, ఆసుపత్రులు, ఇతర నిర్మాణాల నుంచి వస్తున్న ‘చెత్త పన్ను’ దాదాపు రూ.60 కోట్లు వరకు ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని