logo

విశాఖ ఎంపీ, గాజువాక శాసనసభ స్థానానికి పోటీ: కేఏ పాల్‌

ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీని గెలిపించాలని ఆ పార్టీ అధ్యక్షులు కేఏ పాల్‌ కోరారు. రైల్వేన్యూకాలనీలోని పార్టీ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ నుంచి ఎం.పి.గా, గాజువాక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు గురువారం నామినేషన్‌ వేయనున్నట్లు పేర్కొన్నారు.

Updated : 18 Apr 2024 09:31 IST

తాటిచెట్లపాలెం, న్యూస్‌టుడే: ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీని గెలిపించాలని ఆ పార్టీ అధ్యక్షులు కేఏ పాల్‌ కోరారు. రైల్వేన్యూకాలనీలోని పార్టీ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ నుంచి ఎం.పి.గా, గాజువాక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు గురువారం నామినేషన్‌ వేయనున్నట్లు పేర్కొన్నారు. తాను పార్లమెంట్‌ సభ్యునిగా గెలిస్తే స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణను ఆపడానికి తీవ్రంగా ప్రయత్నిస్తానన్నారు. గాజువాక నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయినా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమస్యలను పరిష్కరిస్తానన్నారు.  తమ పార్టీ టికెట్ల కోసం మూడు వేల మంది దరఖాస్తు చేసుకున్నారని, అందులో అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసి రాష్ట్రంలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బరిలోకి దించుతామన్నారు. అంతకుముందు ఆయన ఎన్నికల ప్రచార గీతం విడుదల చేశారు. పార్టీ నాయకులు యేసు పాదం, జిలకర రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని