logo

పారిశుద్ధ్య విధానాలు భేష్‌

వరంగల్‌ మహా నగర పాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య విధానాలు బాగున్నాయని బంగ్లాదేశ్‌, నేపాల్‌ దేశాలకు చెందిన మేయర్లు, అధికారుల బృందాలు కితాబిచ్చారు.

Published : 30 Mar 2023 04:39 IST

హనుమకొండ వడ్డేపల్లి క్రాస్‌రోడ్‌ పబ్లిక్‌ టాయిలెట్‌ వద్ద బంగ్లాదేశ్‌, నేపాల్‌ ప్రతినిధులు

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: వరంగల్‌ మహా నగర పాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య విధానాలు బాగున్నాయని బంగ్లాదేశ్‌, నేపాల్‌ దేశాలకు చెందిన మేయర్లు, అధికారుల బృందాలు కితాబిచ్చారు. అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజి ఆఫ్‌ ఇండియా సంస్థ నిపుణుల ఆధ్వర్యంలో బుధవారం రెండు దేశాలకు చెందిన మున్సిపల్‌ మేయర్లు, అధికారులు నగరంలో పర్యటించారు. హనుమకొండ వడ్డేపల్లి క్రాస్‌ రోడ్‌లో ఆధునిక ప్రజా మరుగుదొడ్డిని చూశారు. ఆధునిక వసతులు అడిగి తెలుసుకున్నారు. వరంగల్‌ సివిల్‌ సొసైటీ ప్రతినిధులతో మాట్లాడారు. ప్రజలతో ముచ్చటించారు. జీవన స్థితిగతులు, ప్రభుత్వం ద్వారా అందుతున్న సేవలు అడిగి తెలుసుకున్నారు. స్వచ్ఛ వరంగల్‌ విధానాలు, అమలవుతున్న పద్ధతులను అస్కి ప్రతినిధులు విదేశీ ప్రతినిధులకు వివరించారు. కార్యక్రమంలో లలిత్‌పూర్‌ మేయర్‌ రాజు మహాజన్‌, గోదావరి మున్సిపల్‌ మేయర్‌ గజేంద్ర మహాజన్‌, అధికారులు కమల్‌ సఫ్కోట, దేవేంద్రకుమార్‌ ఝూ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని