logo

Mahabubabad: హమాలీ కూతురు.. ఎస్సై!

ఆమె లక్ష్యం ముందు పేదరికం ఓడిపోయింది.. తల్లిదండ్రుల కష్టాలను చూస్తూ పెరిగిన యువతి తనకు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు..

Updated : 08 Aug 2023 10:06 IST

హేమలత

ఆమె లక్ష్యం ముందు పేదరికం ఓడిపోయింది.. తల్లిదండ్రుల కష్టాలను చూస్తూ పెరిగిన యువతి తనకు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు.. బాల్యం నుంచి పట్టుదలతో చదువుతూ ఆశయాన్ని సాధించారు. ఎస్సైగా ఎంపికై కన్నవారి కలలను నిజం చేశారు. మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలం ఓటాయి గ్రామానికి చెందిన బొల్లాబోయిన హేమలత సివిల్‌ ఎస్సైగా ఎంపికై ఏజెన్సీకి కీర్తిని తెచ్చిపెట్టారు. బొల్లాబోయిన కుమారస్వామి-పద్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారస్వామి గ్రామంలో హమాలీ పనులు చేస్తు కుటుంబాన్ని పోషిస్తున్నారు. హేమలత ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి పూర్తి చేసి ఓపెన్‌ డిగ్రీ, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీజీ పూర్తి చేసి గ్రూప్‌-1 పరీక్షకు సిద్ధమవుతున్నారు. తల్లితండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూ చెల్లికి పెళ్లి చేశారు. తాను మాత్రం ప్రభుత్వ ఉద్యోగం సాధించేవరకు పెళ్లి చేసుకోవద్దనుకున్నారు. కష్టపడి చదివి తొలి ప్రయత్నంలోనే ఎస్‌ఐకు ఎంపికయ్యారు. హేమలత ఎస్సై ఉద్యోగానికి ఎంపిక కావడంతో కుటుంబసభ్యులు, గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు.

న్యూస్‌టుడే, కొత్తగూడ

తల్లిదండ్రులు కుమారస్వామి, పద్మ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు