logo

Drunkards: మందు బాబులు తెచ్చిన తంటా!

ఓ సోడా సీసా తాగు నీరు సరఫరా చేసే పైపు లైన్‌లో ఇరుక్కొని ఆరు రోజులపాటు తాగునీటికి ఆటంకం కలిగించిన ఘటన గార్లలో చోటుచేసుకుంది. పంచాయతీ సిబ్బంది శనివారం తెలిపిన సమాచారం ప్రకారం.. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం రోడ్డులో ఆరు రోజులుగా మిషన్‌ భగీరథ నీరు సరఫరాకు నోచుకోలేదు.

Updated : 03 Sep 2023 07:44 IST

తాగునీటి సరఫరా పైపులో ఇరుక్కున్న సోడా సీసా

న్యూస్‌టుడే, గార్ల: ఓ సోడా సీసా తాగు నీరు సరఫరా చేసే పైపు లైన్‌లో ఇరుక్కొని ఆరు రోజులపాటు తాగునీటికి ఆటంకం కలిగించిన ఘటన గార్లలో చోటుచేసుకుంది. పంచాయతీ సిబ్బంది శనివారం తెలిపిన సమాచారం ప్రకారం.. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం రోడ్డులో ఆరు రోజులుగా మిషన్‌ భగీరథ నీరు సరఫరాకు నోచుకోలేదు. దాదాపు 30 కుటుంబాల వారు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నీళ్లు రాని విషయమై సర్పంచి బన్సీలాల్‌, పంచాయతీ కార్యదర్శి కుమారస్వామి దృష్టికి తీసుకెళ్లారు. వారు పంచాయతీ సిబ్బందితో పైపులైను మార్గాన్ని తవ్వించారు. తాగునీటి సరఫరా చేసే పైపు లైనులో సోడా సీసా ఇరుక్కొని కనిపించింది. ఆ సీసాను తొలగించి తాగునీటి సరఫరా పునరుద్ధరించారు. నీళ్ల ట్యాంకు ఎక్కి మద్యం తాగి సీసాలను ట్యాంకులో పడేయటంవలనే తాగునీటి సరఫరాకు ఆటంకం కలిగినట్లు సర్పంచి, పంచాయతీ కార్యదర్శి తెలిపారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని