2363 మందికి రూ.28 కోట్లు జరిమానా
ఆస్తిపన్ను స్వీయ ధ్రువీకరణ(సెల్ఫ్ అసెస్మెంటు)పై అవగాహన లేక పోవడంతో నగర ప్రజలు జరిమానాల బారిన పడ్డారు. తప్పుడు ధ్రువీకరణ చేసినందుకు 25 రెట్ల జరిమానాలు మదింపు చేయడంతో ప్రజలు పరేషానవుతున్నారు.
న్యూస్‌టుడే, కార్పొరేషన్: ఆస్తిపన్ను స్వీయ ధ్రువీకరణ(సెల్ఫ్ అసెస్మెంటు)పై అవగాహన లేక పోవడంతో నగర ప్రజలు జరిమానాల బారిన పడ్డారు. తప్పుడు ధ్రువీకరణ చేసినందుకు 25 రెట్ల జరిమానాలు మదింపు చేయడంతో ప్రజలు పరేషానవుతున్నారు. ఇందులో ఎక్కువ శాతం సాధారణ నివాస గృహాల వారే ఉన్నారు. అసలు ఆస్తి పన్ను రూ.1000 ఉంటే, 25 రెట్ల ప్రకారం రూ.25వేల జరిమానా విధించారు. ఇలాంటివి సుమారు రూ.28 కోట్ల బకాయిలు పేరుకు పోయాయి. 2363 మంది బాధితులు బల్దియా ప్రధాన కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. 2019 నూతన పురపాలక చట్టం అనుసరించి 2020-21 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆస్తిపన్ను స్వీయ ధ్రువీకరణ అమల్లోకి తెచ్చారు. చాలామందికి అవగాహన లేక, భవన నిర్మాణ అనుమతి ప్లింత్ ఏరియా ప్రకారం ఆస్తి పన్ను లెక్కలు పంపించారు. క్షేత్రస్థాయి పరిశీలనలో తప్పుడు లెక్కలు చూపించినట్లు నిర్ధారించి కార్పొరేషన్ సిబ్బంది భవనాల యజమానులకు 25 రెట్ల జరిమానా వేశారు. ఒక్కో భవనానికి రూ.25వేల నుంచి రూ.20లక్షల వరకు జరిమానాలు వేశారు. వీటిని చెల్లించేందుకు ప్రజలు ఇష్టపడటం లేదు. మూడేళ్లుగా జరిమానాలు, కరెంటు ఆస్తిపన్ను చెల్లించడం లేదు. అన్ని కలిపి మొత్తం రూ.28కోట్ల బకాయిలుంటాయి. జరిమానాలు రద్దుచేయాలని పలుమార్లు ప్రజావాణిలో అర్జీలు ఇచ్చినా బల్దియా ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. 25 రెట్ల జరిమానాలు రద్దు చేసే అధికారం కమిషనర్‌కు లేదని, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కార్పొరేషన్ అధికారులంటున్నారు. ఇటీవల కొంత మంది బాధితులు కొత్తగా ఎన్నికైనా ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓరుగల్లు వాసుల సంపాదన తక్కువే!
[ 27-07-2024]
ఉమ్మడి వరంగల్‌లోని ఆరు జిల్లాలు విభిన్న రంగాల్లో ప్రగతిపథంలో సాగుతున్నా పలు అంతరాలు కొనసాగుతున్నాయి. తలసరి ఆదాయం, అక్షరాస్యత, పరిశ్రమలు, సేవ, తదితర రంగాల్లో కొన్ని జిల్లాలు ముందు వరుసలో, మరికొన్ని వెనుకబడి ఉన్నాయి. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
దొడ్డు బియ్యం.. నీళ్ల చారు!
[ 27-07-2024]
వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో భోజన ప్రసాదం దొరకడాన్ని భక్తులు అదృష్టంగా భావిస్తారు. -
జిల్లాలను కలుపుతూ బైపాస్ హారం
[ 27-07-2024]
సికింద్రాబాద్-నాగపూర్ మార్గంలో హసన్‌పర్తి రోడ్- పెండ్యాల మీదుగా నష్కల్ను కలుపుతూ ప్రతిపాదించిన బైపాస్ త్వరలో కార్యరూపం దాల్చనుంది. -
చదువుల తల్లికి ఆర్థిక ఇబ్బందులు
[ 27-07-2024]
సరస్వతి కటాక్షం ఉన్నా.. లక్ష్మీ కటాక్షం లేకపోవడంతో చదువుల తల్లిని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. -
వృక్ష జ్ఞాపిక వనం.. పచ్చదనం మాయం
[ 27-07-2024]
పర్యావరణ హితం కోరి నగర ప్రజల్లో మొక్కలు నాటేందుకు ఆసక్తి పెంచేలా వరంగల్ మహా నగరపాలక సంస్థ (జీడబ్లూఎంసీ) 2020 ఫిబ్రవరిలో ‘వృక్ష జ్ఞాపిక వనం’ పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టింది. -
సీఎంఆర్ ధాన్యం ఎటు పోయింది?
[ 27-07-2024]
జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ కింద సేకరించిన వరిని బియ్యంగా మరాడించి తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా కొందరు మిల్లర్లు ముప్పు తిప్పలు పెడుతున్నారు. -
ప్రత్యేక పనులకు మోక్షమెప్పుడో.. ?
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాల్లో తక్షణ అవసరాలు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేక అభివృద్ధి నిధులు(ఎస్డీఎఫ్) పథకాన్ని ప్రారంభించింది. -
‘ముప్పు’ తొలగలే.. సాయం అందలే!
[ 27-07-2024]
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరం.. పాడి, పంటలతో కళకళలాడే మోరంచపల్లి గ్రామం.. గతేడాది ఇదే రోజు వరద సృష్టించిన బీభత్సానికి కకావికలమైంది. -
వీరులారా వందనం..!
[ 27-07-2024]
కార్గిల్ దివస్ పురస్కరించుకొని మానుకోటలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. -
బాబోయ్ దోమలు..!
[ 27-07-2024]
మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ పట్టణాల్లో దోమల నివారణ చర్యలు కానరావడం లేదు. ఫలితంగా వాటి వ్యాప్తి పెరుగుతోంది. ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తూ ఆసుపత్రుల చుట్టూ తిప్పుతున్నాయి. -
నిండు కుండలు..
[ 27-07-2024]
జిల్లాలో ని జలాశయాలు జలసిరి సంత రించుకొన్నాయి. వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో జిల్లా రైతాంగం మురిసిపోతోంది. -
గోదావరికి భారీ వరద
[ 27-07-2024]
రెండు రోజుల పాటు తగ్గుతూ వస్తున్న గోదావరి ప్రవాహం శుక్రవారం పెరిగింది. మండలంలోని తుపాకులగూడెం వద్ద సమ్మక్కసాగర్, దేవాదుల ఇన్‌టేక్‌వెల్ ప్రాజెక్టుల వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. -
వాగులు దాటి వైద్య సేవలు
[ 27-07-2024]
మారుమూల గిరిజన గ్రామాల్లో వైద్యులు వాగులు దాటి సేవలందిస్తున్నారు. కన్నాయిగూడెం మండలంలోని ఐలాపూర్‌లో వాగులను దాటి వైద్య సిబ్బంది శిబిరం ఏర్పాటు చేసి సేవలందించారు. -
డెంగీ కబళించింది..
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ కాటు విషాదాన్ని నింపింది. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరినప్పటికీ.. నిండు ప్రాణాన్ని కబళించింది. -
కొండాయి.. కన్నీటి గాథకు ఏడాది
[ 27-07-2024]
గతేడాది వరద ముంపు చేసిన గాయం ఇప్పటికి మానలేదు. చూస్తుండగానే కాలం గిర్రున తిరిగిపోయింది. గతేడాది 27 జులైన జంపన్న వాగు ఉద్ధృతి కొండాయి చరిత్రలో ఓ చేదు జ్ఞాపకం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్‌రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్‌బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి