logo

‘కేంద్ర మంత్రిగా బలరాంనాయక్‌ చేసింది శూన్యం’

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని, ప్రతి గ్రామంలో భారాస మెజార్టీ సాధించాలని ఆ పార్టీ లోక్‌సభ అభ్యర్థి మాలోత్‌ కవిత, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్‌ అన్నారు.

Published : 22 Apr 2024 02:48 IST

నెల్లికుదురులో మాట్లాడుతున్న భారాస లోక్‌సభ అభ్యర్థి మాలోత్‌ కవిత

నెల్లికుదురు, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని, ప్రతి గ్రామంలో భారాస మెజార్టీ సాధించాలని ఆ పార్టీ లోక్‌సభ అభ్యర్థి మాలోత్‌ కవిత, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్‌ అన్నారు. లోకసభ ఎన్నికల నేపథ్యంలో మండల కేంద్రంలో ఆదివారం సన్నాహాక సమావేశాన్ని నిర్వహించారు.  కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ అభ్యర్థి బలరాంనాయక్‌ కేంద్రమంత్రిగా ఉండి, మానుకోటకు చేసింది శూన్యమన్నారు. మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో భారాస కార్యకర్తలు ప్రజల వద్దకు వెళ్లి వాస్తవాలు వెల్లడించి భారాసను గెలిపించాలన్నారు. ఎంపీపీ మాధవి, జడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి, మండల అధ్యక్షుడు వెంకట్రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు రమేశ్‌, పీఏసీఎస్‌ అధ్యక్షులు వెంకన్న, దేవేందర్‌రావు, నేతలు నవీన్‌రావు, రాము, బిక్కునాయక్‌, అనిల్‌, రామచంద్రు, తదితరులు పాల్గొన్నారు.

నమ్మకం కోల్పోయిన కాంగ్రెస్‌

కేసముద్రం: ఆరు గ్యారంటీ పథకాల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో వాయిదాల పర్వం కొనసాగిస్తుండటంతో ఆ పార్టీపై ప్రజలకు నమ్మకం పోయిందని భారాస ఎంపీ అభ్యర్థి మాలోత్‌ కవిత అన్నారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం పార్లమెంట్‌ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఎంపీ అభ్యర్థి కవితతోపాటు మాజీ మంత్రి సత్యవతిరాథోడ్‌, మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ మాట్లాడుతూ భారాస ఎంపీ అభ్యర్థిని అధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. ఎంపీపీ వోలం చంద్రమోహన్‌, జడ్పీటీసీ సభ్యులు శ్రీనాథ్‌రెడ్డి, మార్క్‌ఫెడ్‌ డైరెక్టర్‌ మర్రి రంగారావు, మండల పార్టీ అధ్యక్షుడు నజీర్‌అహ్మద్‌, కార్యదర్శి కమటం శ్రీనివాస్‌, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు సట్ల వెంకన్న, భారాస నాయకులు  పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని