logo

తప్పుడు పోస్టులు పెడితే కటకటాలే..

సామాజిక మాధ్యమాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వాట్సప్‌, ఫేస్‌బుక్‌ గ్రూపులు బాగా పెరిగిపోయాయి. అభ్యర్థులు, పార్టీల అభిమానులు సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటున్నారు.

Published : 22 Apr 2024 03:08 IST

న్యూస్‌టుడే, గోపాలపూర్‌: సామాజిక మాధ్యమాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వాట్సప్‌, ఫేస్‌బుక్‌ గ్రూపులు బాగా పెరిగిపోయాయి. అభ్యర్థులు, పార్టీల అభిమానులు సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడంతో ఎన్నికల సంఘం ప్రతి అంశంపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. అందులో భాగంగా వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఏర్పాటు చేసిన పెట్రోలింగ్‌ బృందాలు సామాజిక మాధ్యమాల వేదికగా జరిగే చట్టవ్యతిరేక కార్యకలాపాలను గుర్తించి,  సుమోటోగా కేసులు పెట్టి దర్యాప్తు చేస్తున్నారు. ఎన్నికల సందర్భంగా ఎవరైనా తప్పుడు పోస్టులు పెడితే మాత్రం తిప్పలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పార్టీలు, అభ్యర్థుల గొప్పదŸనాన్ని చెప్పుకొనే క్రమంలో ప్రత్యర్థులను కించపరిచేలా, వ్యక్తిగత దూషణలతో రెచ్చగొట్టేలా వాయిస్‌ మెసేజ్‌లు, ఫొటో మార్ఫింగ్‌, అసభ్యకర పోస్టులు పెట్టిన వారికి, మద్దతిస్తూ కామెంట్లు చేసిన వారిపై, గ్రూప్‌ అడ్మిన్‌పై కేసులు పెడుతున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే వారిపై ఐటీ చట్టం, ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని