logo

కదిలిన అధికార యంత్రాంగం

అకాల వర్షాలతో ఇబ్బందులు పడుతున్న రైతుల సమస్యలపై ‘అన్నదాత ఆగమాగం’ అనే శీర్షికతో ‘ఈనాడు’లో శనివారం ప్రచురితమైన కథనానికి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు స్పందించారు

Published : 19 May 2024 04:31 IST

బండారుపల్లి వద్ద తేమ శాతాన్ని పరిశిలిస్తున్న జిల్లా  పౌరసరఫరాల శాఖ అధికారి రాంపతి 

ములుగు, వెంకటాపురం, తాడ్వాయి, న్యూస్‌టుడే: అకాల వర్షాలతో ఇబ్బందులు పడుతున్న రైతుల సమస్యలపై ‘అన్నదాత ఆగమాగం’ అనే శీర్షికతో ‘ఈనాడు’లో శనివారం ప్రచురితమైన కథనానికి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు స్పందించారు. ములుగు మండలంలోని బండారుపల్లి, జీవంతరావుపల్లి, అబ్బాపురం, జంగాలపల్లి, ఇంచెర్ల, వెంకటాపూర్, చల్వాయి, గోవిందరావుపేట, కాటాపూర్, గంగారం, అన్నారం, వెంకటాపురం, ఆకులవారిగణపురం, ఏటూరునాగారం, చిన్నబోయినపల్లి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రాంపతి పలు కేంద్రాలను సందర్శించారు. తూకం వేసి తడిసిన ధాన్యం బస్తాలను మిల్లుకు తరలించారు. తూకం వేయకుండా ఉన్న ధాన్యాన్ని తూకం వేయించారు. ధాన్యం తడవకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి ఎప్పటికప్పుడు అధికారులకు దిశా నిర్దేశం చేశారు. జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి మిల్లర్లతో టెలీకాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేసి తడిసిన ధాన్యం దిగుమతి చేసుకోవాలని,  రైతులను ఎలాంటి ఇబ్బందులకు గురిచేయకూడదని ఆదేశించారు.

ప్రైవేటు కంపెనీలతో ఒప్పందం చేసుకోవాలి

ములుగు: వానాకాలం సాగులో బాండ్‌ కల్టివేషన్‌ ద్వారా విత్తనోత్పత్తి చేసే రైతులు సంబంధిత ప్రైవేటు కంపెనీలతో ఒప్పందం తప్పనిసరిగా చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి విజయచ]ందర్‌ తెలిపారు. ములుగు, వెంకటాపూర్‌ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను సందర్శించి ధాన్యాన్ని పరిశీలించారు. ఆందోళన చెందొద్దని సూచించారు. రైతులు ఒప్పంద పత్రాన్ని పంట కాలం పూర్తయ్యేంత వరకు జాగ్రత్తగా భద్రపర్చుకోవాలని, విత్తనాలను లైసెన్సు ఉన్న డీలరు వద్దనే కొనుగోలు చేసి రసీదు తీసుకోవాలన్నారు. కంపెనీ లేబుల్‌ లేకుండా విడి విత్తనాలు కొని మోసపోవద్దని సూచించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని