logo

భారాస ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరబోతున్నారు..!

భారాస, కాంగ్రెస్‌ డీఎన్‌ఏలు ఒక్కటేనని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు.

Updated : 19 May 2024 05:34 IST

మాట్లాడుతున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి 

సుబేదారి, న్యూస్‌టుడే: భారాస, కాంగ్రెస్‌ డీఎన్‌ఏలు ఒక్కటేనని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో భారాస నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని.. 20 రోజుల్లో 25 మంది చేరుతారని వార్తలు వస్తున్నాయని అన్నారు. ప్రజల తరఫున పోరాటం చేయాలని ప్రజలు ఓటు వేసి గెలిపిస్తే ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా మారుతున్నారని పేర్కొన్నారు.   ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం హనుమకొండకు వచ్చారు. కేజీటూపీజీ యాజమాన్యాల ఆత్మీయ సమ్మేళనంతో పాటు ముఖ్యకార్యకర్తల సమావేశంలో వేర్వేరుగా పాల్గొన్నారు.   నల్గొండ, ఖమ్మం, వరంగల్‌ పట్టభద్రుల నియోజకవర్గం అభ్యర్థిగా భాజపా బలపర్చిన గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని