logo

పోతన స్మారకం.. నిర్మాణానికి గ్రహణం!

 తెలుగు ప్రాచీన కవుల్లో అగ్ర పీఠాన ఉన్న ప్రసిద్ధ కవి బమ్మెర పోతన. ఆయన నడియాడిన నేల జనగామ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గంలోని బమ్మెర గ్రామం.

Published : 25 May 2024 06:12 IST

పోతన సమాధి పనులు పూర్తయినా పక్కన ఉన్న పరిసరాలు అధ్వానంగా..

 తెలుగు ప్రాచీన కవుల్లో అగ్ర పీఠాన ఉన్న ప్రసిద్ధ కవి బమ్మెర పోతన. ఆయన నడియాడిన నేల జనగామ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గంలోని బమ్మెర గ్రామం. ఎంతో చారిత్రక విశేషం కలిగి ఉండటంతో.. పర్యాటకపరంగా అభివృద్ధి చేయాలని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పించి 2017 ఏప్రిల్‌ 8న రూ.7.50 కోట్ల అంచనా వ్యయంతో అద్భుతమైన స్మారక మందిరాన్ని నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు.

అసంపూర్తి నిర్మాణాలు...

పోతన సమాధి, ఆయన వ్యవసాయం చేసిన బావి పరిసరాలను అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దుతామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. అయితే ప్రస్తుతం పోతన సమాధి పనులు దాదాపు పూర్తయినా చేసిన పనులకు నిధులు విడుదల కాకపోవడంతో సంబంధిత కాంట్రాక్టర్‌ మిగతా పనులను నిలిపిపేశారు. దీంతో అక్కడి పరిసర ప్రాంతాలు తాగుబోతులకు అడ్డాగా మారాయి. ఎప్పుడు పూర్తి చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది.  
 గుత్తేదారు నిర్లక్ష్యంతో పనులు ముందుకు సాగడం లేదు.. కొత్త కాంట్రాక్టర్‌ హయాంలో అభివృద్ధి పనులు జరిగేలా చర్యలు తీసుకుంటామని పాలకుర్తి ఆర్‌అండ్‌బీ డీఈఈ జీవన్‌కుమార్‌ తెలిపారు.

 ఈనాడు, హనుమకొండ, న్యూస్‌టుడే, పాలకుర్తి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని