logo

కుల బహిష్కరణ చేస్తామంటున్నారని ఫిర్యాదు

జనగామ పట్టణం సంజయ్‌నగర్‌కు చెందిన ఉల్లెంగుల ప్రభాకర్‌ ఈ నెల(మే) 19న ఆర్థిక సమస్యలతో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన విదితమే.

Published : 25 May 2024 03:31 IST

పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో ఫిర్యాదును చూపిస్తున్న ఉల్లెంగుల లలిత

జనగామ టౌన్, న్యూస్‌టుడే: జనగామ పట్టణం సంజయ్‌నగర్‌కు చెందిన ఉల్లెంగుల ప్రభాకర్‌ ఈ నెల(మే) 19న ఆర్థిక సమస్యలతో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన విదితమే. భర్తను కోల్పోయిన బాధలో ఉన్న తనను తమ సామాజిక వర్గం పెద్దలు పలువురు తనను, తన పిల్లలను బెదిరిస్తూ కుల బహిష్కరణ చేస్తామంటున్నారని ఆరోపిస్తూ మృతుడి భార్య ఉల్లెంగుల లలిత శుక్రవారం జనగామ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. ఓ కులానికి చెందిన పరపతి సంఘానికి మృతుడు ప్రభాకర్‌ స్థానిక అధ్యక్షుడిగా ఉన్నాడు. అయితే సంఘం ఆర్థిక లావాదేవీల్లో ప్రభాకర్‌కు సంఘ సభ్యులకు గతంలో గొడవలు జరిగాయి. ఈ క్రమంలో ప్రభాకర్‌ చనిపోయిన మూడో రోజు ఈ నెల 21న కుల సభ్యులు ఉల్లెంగుల భరత్‌.. లలితతో గొడవపడి ఆమెపై చేయిచేసుకున్నాడు. ఆ తర్వాత సంఘానికి చెందిన ఉల్లెంగుల నర్సింహులు, ఉల్లెంగుల రాజేష్, ఉల్లెంగుల సందీప్, యు.సందీప్‌ నలుగురు లలితతో గొడవపడ్డారు. తమ మూడు తులాల బంగారు గొలుసు పోయిందని నష్టపరిహారం చెల్లించాలని ఆమె అందులో పేర్కొన్నారు. ప్రభాకర్‌ పెద్దకర్మకు కూడా కులస్థులు ఎవరూ వెళ్లకూడదని హుకూం జారీ చేశారని తెలిపారు. దీంతో లలిత, ఆమె పిల్లలిద్దరు పోలీసులను ఆశ్రయించి తమకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ విషయంపై పట్టణ సీఐ రఘుపతిరెడ్డి మాట్లాడుతూ.. లలిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు పూర్వాపరాలను విచారణ చేస్తున్నట్లు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు