logo

భాజపాతోనే పట్టభద్రుల సమస్యలు పరిష్కారం

పట్టభద్రులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనుదారులు, జర్నలిస్టుల సమస్యల పరిష్కారం భాజపాతోనే సాధ్యమని భాజపా జాతీయ కౌన్సిల్‌ సభ్యుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు.

Published : 25 May 2024 03:33 IST

ప్రసంగిస్తున్న ఈటల రాజేందర్, చిత్రంలో ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డి, భాజపా జిల్లా అధ్యక్షుడు
  రవికుమార్, ఎంపీ అభ్యర్థి సీతారాంనాయక్, మాజీ ఎంపీ గరికపాటి మోహన్‌రావు తదితరులు

నర్సంపేట, న్యూస్‌టుడే: పట్టభద్రులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనుదారులు, జర్నలిస్టుల సమస్యల పరిష్కారం భాజపాతోనే సాధ్యమని భాజపా జాతీయ కౌన్సిల్‌ సభ్యుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. భాజపా ఆధ్వర్యంలో శుక్రవారం వరంగల్‌ జిల్లా నర్సంపేటలోని ప్రైవేటు వేడుకల మందిరంలో నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. జమ్ము, కశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడులు లేకుండా ప్రజలు ప్రశాంత జీవనం గడుపుతున్నారంటే మోదీ కారణమన్నారు. మాజీ ఎంపీ గరికపాటి మోహన్‌రావు మాట్లాడుతూ పంటలకు రూ.500 బోనస్‌ ఇస్తామని చెప్పి కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి తొలి ప్రాధాన్య ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ పథకాలు గ్యారంటీ కాదని గారడి మాటలని ఐదు నెలల్లోనే తేలిందన్నారు. ఈ ఎన్నికల్లో తనకు అవకాశమిస్తే సేవకుడిలా పని చేస్తానన్నారు. పార్టీ అధికార ప్రతినిధి రాణిరుద్రమరెడ్డి, రాష్ట్ర నాయకుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, కె.ప్రతాప్, జిల్లా అధ్యక్షుడు రవికుమార్, రాణాప్రతాప్‌ ప్రసంగించారు. సభ అనంతరం పార్టీ నాయకులు ఈటల, ప్రేమేందర్‌రెడ్డిలను గజమాలతో సన్మానించారు. జిల్లా, నియోజకవర్గాల, మండలాల బాధ్యులు, కౌన్సిలర్లు, పట్టభద్రులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని