logo

పాఠ్యపుస్తకాలు వచ్చేశాయి..!

పాఠశాలలు పునఃప్రారంభం రోజే విద్యార్థులకు పాఠ్య పుస్తకాల అందించడంతో పాటు ఏకరూప దుస్తులను కూడా అందించాలనే లక్ష్యంతో విద్యాశాఖాధికారులు కసరత్తు చేస్తున్నారు.

Published : 26 May 2024 05:20 IST

ములుగు, న్యూస్‌టుడే: పాఠశాలలు పునఃప్రారంభం రోజే విద్యార్థులకు పాఠ్య పుస్తకాల అందించడంతో పాటు ఏకరూప దుస్తులను కూడా అందించాలనే లక్ష్యంతో విద్యాశాఖాధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ములుగు జిల్లాలో ఏకరూప దుస్తుల తయారీ వేగంగా జరుగుతోంది. ఐకేపీ మహిళలు ఏకరూప దుస్తుల తయారీలో నిమగ్నమై ఉన్నారు. విద్యార్థులకు పంపిణీ చేసేందుకు పాఠ్యపుస్తకాలు ఇప్పటికే జిల్లా విద్యాశాఖ ఆధీనంలోకి రాగా, వాటిని మండలాల వారీగా పంపిణీకి సిద్ధం చేస్తున్నారు. 

జిల్లాలో మొత్తం 525 బడులు ఉండగా, వీటి పరిధిలో ఒకటి నుంచి 10వ తరగతి వరకు మొత్తం 31,796 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఇందులో ఇంగ్లీషు, తెలుగు మీడియం విద్యార్థులున్నారు. వీరికి పార్ట్‌-1, పార్ట్‌-2 పద్ధతిన పాఠ్యపుస్తకాల రూపకల్పన జరుగుతోంది. ఇందులో భాగంగా విద్యార్థులకు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉచిత పుస్తకాలను పంపిణీ చేయాల్సి ఉంది. 

 ఉచితంగా రాత పుస్తకాలు 

జిల్లా విద్యాశాఖాధికారి ఆధీనంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, కస్తూర్బా బాలికల విద్యాలయాలు, మోడ[ల్‌ స్కూల్స్, గురుకులాల్లో 6 నుంచి 10వ తరగతి వరకు చదివే వారికి ఉచితంగా నోట్‌ బుక్కులను కూడా పంపిణీ చేస్తున్నారు. జిల్లా పరిధిలోని ఈ బడుల్లో చదివే 8,670 మంది విద్యార్థులకు 95,913 నోట్‌ బుక్కులు జిల్లాకు చేరుకున్నాయి. పాఠ్య పుస్తకాలతో పాటు వీటిని కూడా పంపిణీ చేసేందుకు విద్యాశాఖాధికారులు చర్యలు చేపట్టారు. 


మండలాలకు పంపిణీ జరుగుతోంది
- జయదేవ్, జిల్లా సైన్స్‌ అధికారి

జిల్లా కేంద్రానికి చేరిన ఉచిత పాఠ్యపుస్తకాలను మండలాలకు పంపిణీ చేస్తున్నాం. బడులు ప్రారంభమయ్యే రోజే వాటిని విద్యార్థులకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.


జిల్లా వివరాలు 
మొత్తం పాఠశాలలు : 525
విద్యార్థుల సంఖ్య: 31,796
అవసరమయ్యే పార్ట్‌-1 పాఠ్యపుస్తకాలు: 1,71,260
జిల్లాకు వచ్చిన పార్ట్‌-1 : 93,150
కావాల్సిన పార్ట్‌-2 పాఠ్యపుస్తకాలు: 40,210
నిల్వ ఉన్న పాత పుస్తకాలు: 560
రావాల్సిన పార్ట్‌-2 : 39,650 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని