logo

ఆగుతూ.. సాగుతూ..!

మహబూబాబాద్‌ పట్టణంలో నెహ్రూ సెంటర్‌ నుంచి పత్తిపాక మీదుగా రజాలిపేట వరకు టీయూఎఫ్‌ఐడీసీ నిధులు రూ.2.50 కోట్లతో చేపట్టిన రహదారుల విస్తరణ పనులు నాలుగేళ్లుగా కొనసా..గుతున్నాయి.

Published : 28 May 2024 03:33 IST

నత్తనడకన విస్తరణ పనులు

 నెహ్రూ సెంటర్‌ నుంచి పత్తిపాక వెళ్లే రోడ్డులో వదిలేసిన రహదారి పనులు 

మహబూబాబాద్, న్యూస్‌టుడే: మహబూబాబాద్‌ పట్టణంలో నెహ్రూ సెంటర్‌ నుంచి పత్తిపాక మీదుగా రజాలిపేట వరకు టీయూఎఫ్‌ఐడీసీ నిధులు రూ.2.50 కోట్లతో చేపట్టిన రహదారుల విస్తరణ పనులు నాలుగేళ్లుగా కొనసా..గుతున్నాయి. రహదారి నిర్మించాలని అధికారులు, ప్రజాప్రతినిధులు గుత్తేదారులకు ఆదేశాలు ఇస్తుంటే పనులు నిలిపివేయాలంటూ ఆ ప్రాంతంలోని పలువురు ఇళ్ల యజమానులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండడంతో ఎక్కడి వరకు జరిగిన పనులు అక్కడనే నిలిచిపోతున్నాయి. అభ్యంతరాలతో ముందుకు సాగడం లేదు. 

విస్తరణకు అభ్యంతరాలు ఇవి

పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్‌ సమస్య పరిష్కారం కోసం రహదారుల విస్తరణ పనులు చేపట్టారు. నెహ్రూ సెంటర్‌ నుంచి పత్తిపాక, మంగళి కాలనీ వరకు 80 ఫీట్ల వెడల్పుతో రహదారి విస్తరణకు మొదటగా ప్రతిపాదనలు చేశారు. దీంతో అనేక మంది ఇళ్లు కోల్పోతామని స్థానికులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో కొన్నాళ్లపాటు పనులు నిలిచిపోయాయి. 80 ఫీట్ల నుంచి 66 ఫీట్ల వరకు కుదించారు. ఆ ప్రాంతంలో కొందరు ఇంటి ముందుభాగాలను తొలగించి వెనక్కి నిర్మాణం చేసుకున్నారు. అయితే కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే తెచ్చుకోవడంతో విస్తరణ నిలిచిపోయింది. కొంతదూరం పనులు చేసి మరికొంత దూరం పనులను వదిలివేస్తున్నారు. దీంతో రహదారులకు ఇరువైపుల మురుగు కాలువల కోసం తవ్విన గుంతలు ఇబ్బందికరంగా మారాయి. వర్షం వస్తే బురదమయమవుతోంది.


పనులు పూర్తి చేయిస్తాం.
- నోముల రవీందర్, కమిషనర్‌

రహదారుల విస్తరణ పనులపై  దృష్టి సారించాం. కొందరు వ్యక్తులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో వారితో మాట్లాడాం. త్వరలోనే ఈ రహదారి నిర్మాణ పనులు పూర్తి చేయించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం. ఇంజినీరింగ్‌ అధికారులు, గుత్తేదారులతో కూడా మాట్లాడి పనులను వేగవంతం చేయిస్తాం.
విస్తరణకు అభ్యంతరాలు ఇవిపట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్‌ సమస్య పరిష్కారం కోసం రహదారుల విస్తరణ పనులు చేపట్టారు. నెహ్రూ సెంటర్‌ నుంచి పత్తిపాక, మంగళి

కాలనీ వరకు 80 ఫీట్ల వెడల్పుతో రహదారి విస్తరణకు మొదటగా ప్రతిపాదనలు చేశారు. దీంతో అనేక మంది ఇళ్లు కోల్పోతామని స్థానికులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో కొన్నాళ్లపాటు పనులు నిలిచిపోయాయి. 80 ఫీట్ల నుంచి 66 ఫీట్ల వరకు కుదించారు. ఆ ప్రాంతంలో కొందరు ఇంటి ముందుభాగాలను తొలగించి వెనక్కి నిర్మాణం చేసుకున్నారు. అయితే కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే తెచ్చుకోవడంతో విస్తరణ నిలిచిపోయింది. కొంతదూరం పనులు చేసి మరికొంత దూరం పనులను వదిలివేస్తున్నారు. దీంతో రహదారులకు ఇరువైపుల మురుగు కాలువల కోసం తవ్విన గుంతలు ఇబ్బందికరంగా మారాయి. వర్షం వస్తే బురదమయమవుతోంది.


పనులు పూర్తి చేయిస్తాం.
- నోముల రవీందర్, కమిషనర్‌

రహదారుల విస్తరణ పనులపై  దృష్టి సారించాం. కొందరు వ్యక్తులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో వారితో మాట్లాడాం. త్వరలోనే ఈ రహదారి నిర్మాణ పనులు పూర్తి చేయించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం. ఇంజినీరింగ్‌ అధికారులు, గుత్తేదారులతో కూడా మాట్లాడి పనులను వేగవంతం చేయిస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని