logo

ముగ్గురిపై ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు

ఓటరు స్లిప్పులపై భారాస ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి చిత్రం ముద్రించి ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారంటూ ఫ్లయింగ్‌ స్వ్కాడ్‌ సిబ్బంది ముకుంద చిరంజీవి ఫిర్యాదు మేరకు ముగ్గురిపై ఎన్నికల ప్రవర్తన నియామవళి ఉల్లంఘన కింద కేయూ పోలీసు స్టేషన్‌లో సోమవారం సాయంత్రం కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజ్‌కుమార్‌ తెలిపారు.

Published : 28 May 2024 03:50 IST

భీమారం, న్యూస్‌టుడే: ఓటరు స్లిప్పులపై భారాస ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి చిత్రం ముద్రించి ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారంటూ ఫ్లయింగ్‌ స్వ్కాడ్‌ సిబ్బంది ముకుంద చిరంజీవి ఫిర్యాదు మేరకు ముగ్గురిపై ఎన్నికల ప్రవర్తన నియామవళి ఉల్లంఘన కింద కేయూ పోలీసు స్టేషన్‌లో సోమవారం సాయంత్రం కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజ్‌కుమార్‌ తెలిపారు. హనుమకొండలోని కేయూ జంక్షన్‌ ఎస్‌డీఎల్‌సీఈ పోలింగ్‌ కేంద్రం వద్ద ముగ్గురు భారాస కార్యకర్తలు అశోక్, మోహన్, జ్యోతి భారాస ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి ముఖ చిత్రంతో కూడిన ఫొటోను ఓటర్‌ స్లిప్‌లపై రూపొందించి ఓటర్లకు అందిస్తున్నారు. ఈవిషయాన్ని గుర్తించిన ఫ్లయింగ్‌ స్వ్కాడ్‌ సిబ్బంది ముకుంద చిరంజీవి విచారణ చేసి ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నట్లు గుర్తించారు.  అశోక్, మోహన్, జ్యోతిపై కేయూ పోలీసు స్టేషన్‌లో ఆయన ఫిర్యాదు చేశారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని