logo

ముఖ్యమంత్రి దృష్టికి ‘వసూళ్ల పర్వం’

వరంగల్‌ పోలీసు కమిషనరేట్ పరిధిలోని నాలుగు ఠాణాల పరిధిలో పలువురు ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌.ఐల వసూళ్ల పర్వంపై సోమవారం ‘ఈనాడు’ జిల్లా సంచికలో ‘వారి వసూళ్లకు హద్దే లేదు’ శీర్షికన ప్రచురితమైన కథనాన్ని వరంగల్‌ వాసులు సామాజిక మాధ్యమాల ద్వారా ముఖ్యమంత్రి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

Updated : 28 May 2024 06:51 IST

ఈనాడు కథనాన్ని జతచేస్తూ సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్టు  

 ఈనాడు, వరంగల్‌ : వరంగల్‌ పోలీసు కమిషనరేట్ పరిధిలోని నాలుగు ఠాణాల పరిధిలో పలువురు ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌.ఐల వసూళ్ల పర్వంపై సోమవారం ‘ఈనాడు’ జిల్లా సంచికలో ‘వారి వసూళ్లకు హద్దే లేదు’ శీర్షికన ప్రచురితమైన కథనాన్ని వరంగల్‌ వాసులు సామాజిక మాధ్యమాల ద్వారా ముఖ్యమంత్రి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వీరి తీరుపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నిస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు, డీజీపీ రవిగుప్తా, అనిశా డీజీ సీవీ ఆనంద్, వరంగల్‌ సీపీ అంబర్‌కిశోర్‌ ఝా తదితరులకు పోస్టులు చేయడం నగరంలో చర్చనీయాంశమైంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని