logo

కలెక్టరేట్‌కు చేరిన బ్యాలెట్‌ పెట్టెలు

వరంగల్‌- ఖమ్మం- నల్గొండ శాసనమండలి ఉప ఎన్నిక పోలింగ్‌ అనంతరం బ్యాలెట్‌ పెట్టెలు, ఇతర సామగ్రితో ఎన్నికల సిబ్బంది కలెక్టరేట్‌లోని రిసెప్షన్‌ కేంద్రాలకు సోమవారం సాయంత్రం చేరుకున్నారు

Updated : 28 May 2024 06:49 IST

పోలింగ్‌ కేంద్రాల నుంచి బ్యాలెట్‌ పెట్టెలను తీసుకుని వస్తున్న సిబ్బంది

వరంగల్‌ కలెక్టరేట్, న్యూస్‌టుడే: వరంగల్‌- ఖమ్మం- నల్గొండ శాసనమండలి ఉప ఎన్నిక పోలింగ్‌ అనంతరం బ్యాలెట్‌ పెట్టెలు, ఇతర సామగ్రితో ఎన్నికల సిబ్బంది కలెక్టరేట్‌లోని రిసెప్షన్‌ కేంద్రాలకు సోమవారం సాయంత్రం చేరుకున్నారు. రిసెప్షన్‌ సిబ్బంది పోలింగ్‌ కేంద్రాల వారీగా వివరాలను సరిచూసుకుని పోలింగ్‌ సామగ్రిని, బ్యాలెట్‌ పెట్టెలను ఎన్నికల సిబ్బంది నుంచి తీసుకున్నారు. జిల్లా ఎన్నికల అధికారి ప్రావీణ్య సమక్షంలో బ్యాలెట్‌ బాక్సులకు సిబ్బంది సీల్‌ వేశారు. అనంతరం జిల్లా ఎన్నికల అధికారి ప్రావీణ్య మాట్లాడుతూ.. జిల్లాలో 70.83శాతం పోలింగ్‌ నమోదైందని, ఉప ఎన్నిక పోలింగ్‌ నిర్వహణలో జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేశారన్నారు. జిల్లాలోని 59 పోలింగ్‌ కేంద్రాల నుంచి సేకరించిన బ్యాలెట్‌ బాక్సులను, ఇతర ఎన్నికల సామగ్రిని పటిష్ఠ భద్రత నడుమ నల్గొండ జిల్లాకు తరలిస్తామన్నారు.
నర్సంపేట: నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బ్యాలెట్‌ పెట్టెలను సోమవారం రాత్రి అధికారులు పోలీసు బందోబస్తు మధ్య హనుమకొండ కలెక్టరేట్కు ఆర్టీసీ బస్సుల్లో తరలించారు. ఏసీపీ కిరణ్‌కుమార్‌ పర్యవేక్షించారు.
 

 సీల్‌ వేసిన పెట్టెలను పరిశీలిస్తున్న వరంగల్‌ జిల్లా ఎన్నికల అధికారి ప్రావీణ్య 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని