logo

బూజెక్కిన చికెన్‌.. ఇడ్లీ పిండిలో ఈగలు!

రెస్టారెంట్లు.. పైకి చూడడానికి అందమైన అలంకరణలు, ఘుమఘుమలాడే వాసనలు.. భోజనప్రియులను ఆకర్షించే అనేక కొత్త అంశాలు. వంట గదుల్లోకి వెళ్లి చూస్తే అసలు రంగు బయటపడుతుంది.

Updated : 31 May 2024 05:11 IST

ప్రజల ప్రాణాలతో  రెస్టారెంట్ల చెలగాటం

ఇలా కుళ్లిపోయింది..

రెస్టారెంట్లు.. పైకి చూడడానికి అందమైన అలంకరణలు, ఘుమఘుమలాడే వాసనలు.. భోజనప్రియులను ఆకర్షించే అనేక కొత్త అంశాలు. వంట గదుల్లోకి వెళ్లి చూస్తే అసలు రంగు బయటపడుతుంది.

ఈనాడు, వరంగల్‌

బూజు పట్టి..

రంగల్‌ నగరంలో పలు ఖరీదైన రెస్టారెంట్లలో గురువారం ఆహార భద్రతా అధికారులు చేసిన తనిఖీల్లో విస్తుగొలిపే వాస్తవాలు బయటపడ్డాయి. హానికరమైన ఆహార పదార్థాలు, క్యాన్సర్‌ కారక నూనెలను గుర్తించారు. యాజమాన్యాలు నాణ్యతను పూర్తిగా గాలికొదిలేసి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నట్లు స్పష్టమైంది.

బెల్లం పరిస్థితి ఇది..

ఉమ్మడి వరంగల్‌వ్యాప్తంగా నిత్యం వేల సంఖ్యలో ప్రజలు వివిధ అవసరాల కోసం నగరానికి వస్తుంటారు. వారంతా ఆకలి తీర్చుకోవడానికి ఇక్కడి రెస్టారెంట్లపైనే ఆధారపడతారు..

  • శ్రేయ హోటల్‌ వంట గదిలోని మూకుడులో నూనెలను యంత్రాలతో పరీక్షించగా అందులో టీపీసీ (టోటల్‌ పోలార్‌ కాంపౌండ్స్‌) ఏకంగా 49 శాతం వచ్చినట్టు గుర్తించారు. స్వచ్ఛమైన నూనెలో 15 శాతం ఉండాలి. మరిగించాక 18 నుంచి 20 శాతం ఉంటే సురక్షితం.. ఆ స్థాయి దాటితే అది క్యాన్సర్‌ కారకం అవుతుందని  హోటల్‌ నిర్వాహకులపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నూనెలను పదేపదే మరిగిస్తున్నట్టు తేలింది. ఇదే రెస్టారెంట్లో కృత్రిమ హానికరమైన రంగులతో చికెన్‌ కబాబ్స్, ఆహార పదార్థాల్లో కలిపి, అపరిశుభ్ర వాతావరణంలో వంటకాలు  తయారుచేసి అమ్ముతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నట్టు అధికారులు పసిగట్టారు. యాజమాన్యానికి నోటీసులు జారీ చేసి 11 కిలోల రంగు కలిపిన, బూజుపట్టిన చికెన్, బొద్దింకలతో కూడిన ఇడ్లీ పిండి, బెల్లం ధ్వంసం చేశారు.
  • అశోక హోటల్‌ (కాకతీయ హోటల్స్‌ ప్రైవేట్ లిమిటెడ్‌) తనిఖీ చేయగా హానికరమైన కృత్రిమ రంగులు కలిపిన ఆహార పదార్థాలు బయటపడ్డాయి. భారీ రంగు డబ్బాలు, మళ్లీ మళ్లీ కాచిన పది లీటర్ల నూనె, కాలం చెల్లిన కస్తూరి మేతి, చికెన్‌ మసాలాలను ధ్వంసం చేశారు. తయారీ తేదీ లేకుండా స్టోర్‌ రూంలో నిల్వ ఉంచిన రూ.5500 విలువగల 17 నూడుల్స్, 28 సోంపు ప్యాకెట్లను సీజ్‌ చేసి నమూనాలు తీసి ప్రయోగశాలకు పంపించారు. నిర్వాహకులకు నోటీసులిచ్చారు. ప్రయోగశాల ఫలితాల ఆధారంగా కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు.
  • నక్కలగుట్టలోని అరణ్య జంగల్‌ థీమ్‌ రెస్టారెంట్లోని రిఫ్రిజిరేటర్‌లో ప్రమాణాల ప్రకారం సరైన ఉష్ణోగ్రతలు లేకపోవడాన్ని గుర్తించారు. ప్రమాదకర ప్లాస్టిక్‌ కవర్లలో మాంసాన్ని నిల్వ చేయడం, తుప్పు పట్టిన వంటపాత్రలను వినియోగించడంతోపాటు, బూజు పట్టిన కూరగాయలను గుర్తించారు. 26 కిలోల మాంసపు ఉత్పత్తులను ధ్వంసం చేసి నోటీసులిచ్చారు.

నోటీసులు జారీ..

తనిఖీ చేస్తున్న అధికారుల బృందం

రాష్ట్ర ఫుడ్‌ సేఫ్టీ కమిషనర్‌ ఆదేశాల ప్రకారం జోనల్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ వి.జ్యోతిర్మయి నేతృత్వంలో ఉమ్మడి జిల్లా ఆహార తనిఖీ అధికారుల బృందం గురువారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వరంగల్‌ నగరంలో ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించింది. తనిఖీలు చేపట్టిన మూడు రెస్టారెంట్లలో అనేక లోపాలు బయటపడ్డట్టు జ్యోతిర్మయి తెలిపారు. నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. తనిఖీల్లో ఉమ్మడి వరంగల్‌ ఫుడ్‌ సేఫ్టీ అధికారులు వేణుగోపాల్, సీహెచ్‌ కృష్ణమూర్తి, పి.మనోజ్‌కుమార్, నల్గొండ అధికారిణి స్వాతి పాల్గొన్నారు.

ముసురుకున్న ఈగలతో..

పాడైన కోడి గుడ్లు..

దుర్వాసన వస్తున్న వంటకం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని