logo

‘సంక్షోభంలో విద్యారంగం’

రాష్ట్ర సాధన తర్వాత ప్రభుత్వ విద్యారంగం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కంటే మరింత సంక్షోభంలోకి కూరుకుపోయిందని డెమోక్రటిక్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (డీటీఎఫ్‌) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి ఆరోపించారు. ఆదివారం హనుమకొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

Published : 03 Oct 2022 01:54 IST

ప్రసంగిస్తున్న డీటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి

వరంగల్‌ విద్యావిభాగం, న్యూస్‌టుడే: రాష్ట్ర సాధన తర్వాత ప్రభుత్వ విద్యారంగం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కంటే మరింత సంక్షోభంలోకి కూరుకుపోయిందని డెమోక్రటిక్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (డీటీఎఫ్‌) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి ఆరోపించారు. ఆదివారం హనుమకొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామనేది ప్రకటనలకే పరిమితమైందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,967 ప్రధానోపాధ్యాయులు, 7136 స్కూల్‌ అసిస్టెంట్లు ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఏడుగురు డీఈవోలు, పన్నెండు మంది రెగ్యులర్‌ ఎంఈవోలు ఉంటే నాణ్యమైన విద్యను పిల్లలకు ఎలా అందిస్తారని ప్రశ్నించారు. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడానికి చేపట్టిన ‘మన ఊరు- మన బడి, మనబస్తీ- మనబడి’ కార్యక్రమానికి నిధులు లేకపోవడంతో పది శాతం పూర్తి కాలేదని విమర్శించారు. విద్యా వ్యవస్థను ప్రభుత్వం భ్రష్టుపట్టిస్తోందని విమర్శించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు చాప బాబుదొర, రాష్ట్ర కార్యదర్శి ఎ.శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా, రాష్ట్ర నేతలు కె.శ్రీనివాస్‌, టి.సుదర్శనం, ఎన్‌.సుభాషిణి, సీహెచ్‌.అశోక్‌, డి.రమేశ్‌, ఎండీ.అబ్దుల్‌అలీం, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని