logo

రూ.41 కోట్ల పన్నులు వసూలు చేయాలి

ఆస్తి పన్ను వసూలులో పురోగతి తక్కువగా ఉందని, ఇంకా రూ.41 కోట్ల బకాయిలు వసూలు చేసేందుకు అధికారులు, ఉద్యోగులు అంకితభావంతో పనిచేయాలని మేయర్‌ గుండు సుధారాణి కోరారు.

Published : 03 Feb 2023 06:28 IST

పన్నుల విభాగం అధికారులు, ఉద్యోగులతో సమావేశమైన మేయర్‌ సుధారాణి

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: ఆస్తి పన్ను వసూలులో పురోగతి తక్కువగా ఉందని, ఇంకా రూ.41 కోట్ల బకాయిలు వసూలు చేసేందుకు అధికారులు, ఉద్యోగులు అంకితభావంతో పనిచేయాలని మేయర్‌ గుండు సుధారాణి కోరారు. గురువారం బల్దియా ప్రధాన కార్యాలయంలో పన్నుల విభాగం అధికారులు, ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. పెండింగ్‌ దస్త్రాలు, పన్నుల వసూలు, సిటిజన్‌ చార్టర్‌ అమలు తదితర అంశాలపై సమీక్షించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆస్తి పన్ను డిమాండ్‌ రూ.91.06 కోట్లు కాగా, ఇప్పటివరకు రూ.50.06 కోట్లు వసూలయ్యాయని, మిగిలిన బకాయిలు వసూలుకు రోజువారీ లక్ష్యాలు ఖరారు చేయాలని మేయర్‌ సూచించారు. ప్రజలపై పన్నుల భారం లేకుండా గ్రేటర్‌ ఆదాయం పెంచేందుకు దృష్టి సారించాలన్నారు. ఖాళీ స్థలాలు, నిర్మాణాలు పూర్తయిన భవనాలకు వెంటనే ఆస్తిపన్ను మదింపు చేయాలన్నారు. సమావేశంలో ఉపకమిషనర్‌ జోనా, ఆర్వోలు సుదర్శన్‌, షహజాది బేగం, యూసఫొద్దీన్‌, శ్రీనివాస్‌, ఆర్‌ఐలు పాల్గొన్నారు.


ఇంజినీర్లపై ఆగ్రహం

అభివృద్ధి పనుల వివరాలు, టెండర్లు, ఒప్పందాలు, వాహనాల మరమ్మతుల జాప్యంపై మేయర్‌ సుధారాణి ఇంజినీర్లపై ఆగ్రహం చెందారు. వరంగల్‌ ఓసిటీలో జరుగుతున్న జిల్లాస్థాయి క్రీడల పోటీల కోసం రూ.25 లక్షలు ఖర్చు చేసిన అంశాన్ని ఎందుకు చెప్పలేదని ఇంజినీర్లను నిలదీసినట్లు తెలిసింది. కనీస సమాచారం ఇవ్వరా? ప్రశ్నించినట్లుగా సమాచారం. డివిజన్లలో కొత్తగా ప్రతిపాదించిన పలు అభివృద్ధి పనులపై చర్చించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు