logo

ఓటేసేందుకు వెళ్తున్నారా.. గుర్తింపు కార్డు తప్పనిసరి

ఓటు వేసే సమయం ఆసన్నమైంది. దూరం ఎంతైనా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఈ నెల 30న ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు.

Published : 30 Nov 2023 03:16 IST

భూపాలపల్లి టౌన్‌, న్యూస్‌టుడే: ఓటు వేసే సమయం ఆసన్నమైంది. దూరం ఎంతైనా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఈ నెల 30న ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించిన 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తీసుకెళ్తే సరిపోతుంది. వాటిలో ఫొటో, ఓటరు జాబితాతో పేరు సరిపోల్చితే ఓటేసేందుకు అనుమతిస్తారు. జాబితాలో పేరుంటే గుర్తింపు కార్డు సరిపోతోంది.

వీటిలో ఏదైనా సరే..:

  • ఆధార్‌ కార్డు
  • డ్రైవింగ్‌ లైసెన్స్‌
  • పాన్‌ కార్డు
  • భారతీయ పాస్‌పోర్టు
  • జాతీయ గ్రామీణ ఉపాధి హామీ జాబ్‌కార్డు
  • ఆర్‌బీఐ జారీ చేసిన స్మార్ట్‌ కార్డు
  • పింఛను మంజూరు పత్రం
  • దివ్యాంగుల గుర్తింపు కార్డు
  • ఫొటో ఉన్న పోస్టాఫీస్‌ లేదా బ్యాంక్‌ పాసు పుస్తకం
  • ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలకు జారీ చేసిన గుర్తింపు కార్డు
  • కార్మిక శాఖ జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్‌ కార్డు
  • ఫొటో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల లిమిటెడ్‌ కంపెనీల ఉద్యోగి గుర్తింపు కార్డు
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని