logo

ఏజెంట్లు కీలకం!

పోలింగ్‌ కేంద్రంలో అభ్యర్థుల తరఫున పరిశీలనకు కూర్చునే ఏజెంట్ల పాత్ర కీలకం. బోగస్‌ ఓట్లు పడకుండా, ఓటేయడానికి వచ్చే వారిని వీరు నిశితంగా పరిశీలిస్తారు. ఒక ఓటు తేడాతో గెలుపోటములు తారుమారయ్యే అవకాశం ఉన్నందున ఏజెంట్లుగా ఉండే వారు అభ్యర్థికి అత్యంత విశ్వాసపాత్రులుగా ఉంటారు.

Published : 30 Nov 2023 03:21 IST

వరంగల్‌ వ్యవసాయం, న్యూస్‌టుడే: పోలింగ్‌ కేంద్రంలో అభ్యర్థుల తరఫున పరిశీలనకు కూర్చునే ఏజెంట్ల పాత్ర కీలకం. బోగస్‌ ఓట్లు పడకుండా, ఓటేయడానికి వచ్చే వారిని వీరు నిశితంగా పరిశీలిస్తారు. ఒక ఓటు తేడాతో గెలుపోటములు తారుమారయ్యే అవకాశం ఉన్నందున ఏజెంట్లుగా ఉండే వారు అభ్యర్థికి అత్యంత విశ్వాసపాత్రులుగా ఉంటారు.

  • గుర్తింపు పొందిన రిజిస్టర్డ్‌ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రుల ఏజెంట్లు ప్రాధాన్య క్రమంలో కూర్చుంటారు. ప్రతి పోలింగ్‌ కేంద్రానికి ఒక పోలింగ్‌ ఏజెంటు, ఇద్దరు రిలీఫ్‌ ఏజెంట్లను నియమించుకోవచ్చు.
  • స్థానిక కేంద్రం పరిధిలో ఓటరుగా నమోదై  ఉండాలి.   
  • పోలింగ్‌ సమయానికి కనీసం గంట ముందుగా కేంద్రానికి చేరుకోవాలి. మిషన్‌ల సీల్‌ తీసే క్రమంలో సంతకం చేయాలి. ఓటింగ్‌ ముగిసిన అనంతరం కూడా ఈవీఎంల సీలింగ్‌ ప్రక్రియను పర్యవేక్షించి దానిపై సంతకం చేయాలి.
  • పోలింగ్‌ కేంద్రంలో జరిగే ప్రతి కదలికను  నిశితంగా పరిశీలించాలి. ఏ  అనుమానం వచ్చినా ప్రిసైడింగ్‌ అధికారి, పరిశీలకులకు, లేదా సూక్ష్మ పరిశీలకులకు ఫిర్యాదు చేయవచ్చు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని