logo

చీటీ అందలేదా.. ఫర్వాలేదు!!

ఓటర్లకు ఓటరు స్లిప్పులు అందకపోవచ్చు. అలాంటి వారు ఇబ్బందులు పడి పోలింగ్‌కు దూరంగా ఉండడం సబబు కాదు. అరచేతిలోనే సాంకేతిక విప్లవం అందుబాటులో ఉన్న ప్రస్తుత తరుణంలో ఓటు వివరాలు తెలుసుకోవడం చాలా సులభం.

Updated : 30 Nov 2023 05:03 IST

ఓటర్లకు ఓటరు స్లిప్పులు అందకపోవచ్చు. అలాంటి వారు ఇబ్బందులు పడి పోలింగ్‌కు దూరంగా ఉండడం సబబు కాదు. అరచేతిలోనే సాంకేతిక విప్లవం అందుబాటులో ఉన్న ప్రస్తుత తరుణంలో ఓటు వివరాలు తెలుసుకోవడం చాలా సులభం.

ఎస్‌ఎంఎస్‌ ద్వారా...: ఓటరు గుర్తింపు కార్డు నెంబరును 1950 లేదా 9211728082 నెంబర్లకు పంపిస్తే మీ పోలింగ్‌ కేంద్రం వివరాలు సంక్షిప్త సమాచారం (ఎస్‌ఎంఎస్‌) ద్వారా లభిస్తుంది. 

టోల్‌ ఫ్రీ నెంబరు... : ఇరవైనాలుగు గంటపాటు పనిచేసే టోల్‌ఫ్రీ నెంబరు 1950కు ఫోన్‌ చేసి ఓటరు గుర్తింపు కార్డు నెంబరు సాయంతో పోలింగ్‌ కేంద్రం, బూత్‌ నెంబరు, క్రమ సంఖ్య వంటి వివరాలు తెలుసుకోవచ్చు. 

యాప్‌.... : ఓటరు హెల్ప్‌లైన్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని వివరాలు పొందవచ్చు.

అంతర్జాలం.. : ఎన్నికల కేంద్రం వెబ్‌ సైట్‌ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.సీఈవో తెలంగాణ.ఎన్‌ఐసీ.ఇన్‌ ద్వారా పోలింగ్‌ కేంద్రాల చిరునామాలు, వాటి ఫొటోలు గూగుల్‌ మ్యాప్‌ వివరాలు చూసుకోవచ్చు.

న్యూస్‌టుడే, గోపాలపూర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని