logo

ఏజెన్సీలో నాలుగు గంటల వరకే పోలింగ్‌!

జిల్లాలోని ఏజెన్సీ మండలాలైన కొత్తగూడ, గంగారం, బయ్యారం మండలాల్లో గురువారం నిర్వహిస్తున్న శాసనసభ ఎన్నికల్లో పోలింగ్‌ సమయం సాయంత్రం 4 గంటలకు ముగియనుంది. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలుగా గుర్తించిన ఎన్నికల సంఘం ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది.

Published : 30 Nov 2023 03:38 IST

కొత్తగూడకు చేరిన సిబ్బంది

కొత్తగూడ, బయ్యారం, న్యూస్‌టుడే: జిల్లాలోని ఏజెన్సీ మండలాలైన కొత్తగూడ, గంగారం, బయ్యారం మండలాల్లో గురువారం నిర్వహిస్తున్న శాసనసభ ఎన్నికల్లో పోలింగ్‌ సమయం సాయంత్రం 4 గంటలకు ముగియనుంది. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలుగా గుర్తించిన ఎన్నికల సంఘం ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. ఏజెన్సీలోని మారుమూల గ్రామాల్లోని పోలింగ్‌ కేంద్రాల నుంచి పోలింగ్‌ సామగ్రిని తరలించేందుకు సమయం పడుతుందని భావించిన అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ కేంద్రానికి చేరుకున్న ఓటర్లను మాత్రమే తమ హక్కును వినియోగించుకుంటారు. ఆ తర్వాత వచ్చిన వారిని అనుమతించరు. కొత్తగూడ మండలంలో 38 పోలింగ్‌కేంద్రాలు, గంగారంలో 17పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. గురువారం జరగాల్సిన ఎన్నికల కోసం పోలింగ్‌ సిబ్బంది ఇప్పటికే ఆయా కేంద్రాలకు చేరుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు