logo

కొత్త ఎమ్మెల్యేలకు అంగరక్షకుల కేటాయింపు

అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారికి పోలీసులు రక్షణ కల్పించనున్నారు. నిఘా వర్గాల ఆదేశాల మేరకు అంగరక్షకులను వరంగల్‌ కమిషనర్‌ పోలీసులు కేటాయించారు. కమిషనరేట్‌ పరిధిలో ఎనిమిది నియోజకవర్గాలు ఉన్నాయి.

Published : 05 Dec 2023 03:16 IST

వరంగల్‌క్రైం, న్యూస్‌టుడే: అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారికి పోలీసులు రక్షణ కల్పించనున్నారు. నిఘా వర్గాల ఆదేశాల మేరకు అంగరక్షకులను వరంగల్‌ కమిషనర్‌ పోలీసులు కేటాయించారు. కమిషనరేట్‌ పరిధిలో ఎనిమిది నియోజకవర్గాలు ఉన్నాయి. జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌ల నుంచి గెలుపొందిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కడియం శ్రీహరిలు ఇప్పటికే ఎమ్మెల్సీలుగా ఉన్నారు. వారికి గతంలో ఉన్న అంగరక్షకులను కొనసాగిస్తారు. మాజీ మంత్రి కొండా సురేఖకు ఒక్క అంగరక్షకుడు ఉన్నారు. తాజాగా మరో ఇద్దరిని కేటాయించారు. నాయిని రాజేందర్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, నాగరాజు, యశస్వినిరెడ్డి, దొంతి మాధవరెడ్డిలకు ఇద్దరి చొప్పున ఆంగరక్షకులను కేటాయించారు. ప్రస్తుతం వారు స్థానికంగా అందుబాటులో లేరు. వారు వచ్చిన వెంటనే కేటాయించిన అంగరక్షకులు విధుల్లో చేరుతారు. ఈమేరకు పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు