logo

దివ్యాంగులను ఆప్యాయతతో చేరదీయాలి

ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యాంగులను ఆప్యాయతతో చేరదీయాలని వరంగల్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.రాధా దేవి అన్నారు. వరంగల్‌ న్యాయ సేవా సదన్‌ భవనంలో సోమవారం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.

Published : 05 Dec 2023 03:42 IST

వరంగల్‌ న్యాయవిభాగం, న్యూస్‌టుడే: ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యాంగులను ఆప్యాయతతో చేరదీయాలని వరంగల్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.రాధా దేవి అన్నారు. వరంగల్‌ న్యాయ సేవా సదన్‌ భవనంలో సోమవారం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. దివ్యాంగుల బాగోగులు చూసే సంస్థలకు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. ప్రత్యేక అవసరాలు కలిగిన బాలబాలికలకు చేయూత ఇస్తున్న సంస్థలకు న్యాయ సేవ అధికార సంస్థలు ఎల్లప్పుడూ అండగా ఉంటాయన్నారు. వారి పట్ల చిన్నచూపు, హేళన భావం చూపించకూడదని కోరారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.సాయికుమార్‌, విశ్రాంత ప్రొఫెసర్‌ పద్మ, డాక్టర్‌ అనితారెడ్డి, క్లినికల్‌ సైకాలజిస్టు డాక్టర్‌ పాండు, పలు మనోవికాస కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని