logo

లోక్‌సభ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి

త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు పోలీసు అధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌ జి పాటిల్‌ సూచించారు.

Published : 01 Mar 2024 03:06 IST

సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌ జీ పాటిల్‌

నెహ్రూసెంటర్‌, న్యూస్‌టుడే: త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు పోలీసు అధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌ జి పాటిల్‌ సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని పట్టణ ఠాణా సమావేశ మందిరంలో నెలవారీ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి హాజరైన ఎస్పీ జిల్లా పరిధిలోని ఆయా పోలీస్‌ స్టేషన్ల పరిధిలో పెండింగ్‌, విచారణలో ఉన్న కేసుల వివరాలను తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ సకాలంలో దర్యాప్తు చేసి నేరస్థులను న్యాయస్థానంలో హాజరు పర్చాలన్నారు. అదృశ్యం కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. మార్చి 9న జరిగే జాతీయ మెగా లోక్‌ అదాలత్‌లో  ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. ప్రజలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా గ్రామాల్లో అవగాహన కల్పించాలని కోరారు. పోలీస్‌ అధికారులు సిబ్బంది విధి నిర్వహణలో అలసత్వం చూపరాదన్నారు. జిల్లా సరిహద్దులు, ఠాణాల పరిధిలో ముమ్మర తనిఖీలు నిర్వహించి ఎలాంటి అక్రమ రవాణా జరగకుండా చూడాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ జోగుల చెన్నయ్య, శిక్షణ ఐపీఎస్‌ పండరి చేతన్‌ నితిన్‌, మహబూబాబాద్‌ డీఎస్పీ తిరుపతిరావు, తొర్రూరు డీఎస్పీ సురేష్‌, సీఐలు, ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు