logo

కాసుల ఖాకీ..!

నిష్పక్షపాతంగా సేవలు అందించాల్సింది పోయి ఓ పోలీసు అధికారి కాసులకు కక్కురి పడ్డారు.

Published : 01 Mar 2024 03:06 IST

ఈనాడు, మహబూబాబాద్‌:  నిష్పక్షపాతంగా సేవలు అందించాల్సింది పోయి ఓ పోలీసు అధికారి కాసులకు కక్కురి పడ్డారు. మహబూబాబాద్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలోని ఒక ప్రధాన పోలీస్‌స్టేషన్‌లో ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఒక ఎస్సై వాహనం దొంగతనం కేసులో ముడుపులు తీసుకుని నిందితుడిని ఇంటికి పంపించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. జిల్లాలోని ఒక ఎక్సైజ్‌ స్టేషన్‌ అధికారులు గుడుంబా బెల్లాన్ని తరలిస్తున్న వాహనాన్ని పట్టుకుని తమ ఆధీనంలో పెట్టుకున్నారు. ఇటీవల వాహనం చోరీకి గురవ్వడంతో అధికారులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వాహనాన్ని అపహరించిన వ్యక్తిని పట్టుకుని స్టేషన్‌కు తీసుకొచ్చారు. దాన్ని యజమానే దొంగలించాడని సమాచారం. అతడి అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని రిమాండ్‌ పేరుతో ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యపరీక్షలు చేయించారు. తర్వాత  రిమాండ్‌కు వెళ్లకుండా ఉండాలంటే తమకు కొంత డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. నిందితుడి నుంచి రూ.80 వేల వరకు వసూలు చేసి స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి ఇంటికి పంపినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారమంతా ఒక కానిస్టేబుల్‌ ద్వారా నడిపించినట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని