logo

మీటర్లు గిర్రున తిరుగుతున్నాయ్‌..!

భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు.. వ్యవసాయంతో పాటు గృహావసరాలకు అధికంగా వినియోగిస్తున్నారు. చెరువులు ఎండిపోవడం, కాలువల ద్వారా సాగునీరు రాకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి.

Updated : 03 Apr 2024 06:10 IST

పెరిగిన విద్యుత్తు వినియోగం

మహబూబాబాద్‌, న్యూస్‌టుడే: భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు.. వ్యవసాయంతో పాటు గృహావసరాలకు అధికంగా వినియోగిస్తున్నారు. చెరువులు ఎండిపోవడం, కాలువల ద్వారా సాగునీరు రాకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. దీంతో రైతులు బావుల నుంచి విద్యుత్తు మోటార్ల ద్వారా నీరందిస్తున్నారు. దీనికితోడు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. పట్టపగలు, రాత్రి వేళల్లో వీస్తున్న వడగాలుల నుంచి ఉపశమనం పొందేందుకు కూలర్లు, ఏసీలు అధికంగా వాడుతున్నారు. శీతల పానీయాల వినియోగం పెరగడంతో విద్యుత్తు సరఫరాకు డిమాండ్‌ పెరిగింది.

గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈ సంవత్సరం అదే నెలలో 5.1 మెగావాట్ల యూనిట్లను అధికంగా వినియోగించారు. మార్చిలో 20.24 మెగావాట్ల వాడకం అధికంగా పెరిగినట్లు అధికారిక గణాంకాలు సూచిస్తున్నాయి.

ఉచితమని వాడితే బిల్లు పడుద్ది

జిల్లాలో సుమారు 90 వేల మంది గృహవినియోగదారులకు గృహజ్యోతి పథకం ద్వారా విద్యుత్తును ఉచితంగా సరఫరా చేస్తున్నారు. తెల్ల రేషన్‌ కార్డు కలిగిన గృహ వినియోగదారులు ఇష్టానుసారంగా వాడితే రెండు వందల యూనిట్లు దాటగానే బిల్లు వచ్చే ప్రమాదం ఉంది. ఉచితంగా విద్యుత్తు సరఫరా పొందుతున్నవారితో పాటు ఇతరులు కూడా పొదుపుగా వాడుకుంటే అందరికీ మేలు జరుగుతుంది.


పొదుపుగా వాడాలి
- పి.నరేష్‌, ఎస్‌ఈ, టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌, మహబూబాబాద్‌.

సరఫరాను దృష్టిలో ఉంచుకొని పొదుపు చేస్తే మంచిది. అవసరాలకు మించి వాడితే లోడ్‌ ఎక్కువై సాంకేతిక సమస్యలు ఎదురవుతాయి. వాటిని గమనిస్తూ వినియోగించడం వల్ల డబ్బులు కూడా ఆదా అవుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని