logo

2363 మందికి రూ.28 కోట్లు జరిమానా

ఆస్తిపన్ను స్వీయ ధ్రువీకరణ(సెల్ఫ్‌ అసెస్‌మెంటు)పై అవగాహన లేక పోవడంతో నగర ప్రజలు జరిమానాల బారిన పడ్డారు. తప్పుడు ధ్రువీకరణ చేసినందుకు 25 రెట్ల జరిమానాలు మదింపు చేయడంతో ప్రజలు పరేషానవుతున్నారు.

Published : 22 Apr 2024 02:45 IST

న్యూస్‌టుడే, కార్పొరేషన్‌: ఆస్తిపన్ను స్వీయ ధ్రువీకరణ(సెల్ఫ్‌ అసెస్‌మెంటు)పై అవగాహన లేక పోవడంతో నగర ప్రజలు జరిమానాల బారిన పడ్డారు. తప్పుడు ధ్రువీకరణ చేసినందుకు 25 రెట్ల జరిమానాలు మదింపు చేయడంతో ప్రజలు పరేషానవుతున్నారు. ఇందులో ఎక్కువ శాతం సాధారణ నివాస గృహాల వారే ఉన్నారు. అసలు ఆస్తి పన్ను రూ.1000 ఉంటే, 25 రెట్ల ప్రకారం రూ.25వేల జరిమానా  విధించారు. ఇలాంటివి సుమారు రూ.28 కోట్ల బకాయిలు పేరుకు పోయాయి. 2363 మంది బాధితులు బల్దియా ప్రధాన కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. 2019 నూతన పురపాలక చట్టం అనుసరించి 2020-21 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆస్తిపన్ను స్వీయ ధ్రువీకరణ అమల్లోకి తెచ్చారు. చాలామందికి అవగాహన లేక, భవన నిర్మాణ అనుమతి ప్లింత్‌ ఏరియా ప్రకారం ఆస్తి పన్ను లెక్కలు పంపించారు. క్షేత్రస్థాయి పరిశీలనలో తప్పుడు లెక్కలు చూపించినట్లు నిర్ధారించి కార్పొరేషన్‌ సిబ్బంది భవనాల యజమానులకు 25 రెట్ల జరిమానా వేశారు. ఒక్కో భవనానికి రూ.25వేల నుంచి రూ.20లక్షల వరకు జరిమానాలు వేశారు. వీటిని చెల్లించేందుకు ప్రజలు ఇష్టపడటం లేదు. మూడేళ్లుగా జరిమానాలు, కరెంటు ఆస్తిపన్ను చెల్లించడం లేదు. అన్ని కలిపి మొత్తం రూ.28కోట్ల బకాయిలుంటాయి. జరిమానాలు రద్దుచేయాలని పలుమార్లు ప్రజావాణిలో అర్జీలు ఇచ్చినా బల్దియా ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. 25 రెట్ల జరిమానాలు రద్దు చేసే అధికారం కమిషనర్‌కు లేదని, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కార్పొరేషన్‌ అధికారులంటున్నారు. ఇటీవల కొంత మంది బాధితులు కొత్తగా ఎన్నికైనా ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని