logo

ఇవండీ మా ఆస్తులు.. అప్పులు

ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలక అంకమైన నామపత్రాల స్వీకరణ మొదలు కావటంతో ఉమ్మడి పశ్చిమలో ఎన్నికల సందడి మొదలైంది.

Published : 19 Apr 2024 04:28 IST

నామపత్రాల్లో అభ్యర్థుల వెల్లడి
కూటమి, వైకాపా నుంచి ఒక్కొక్కటి దాఖలు

న్యూస్‌టుడే, ఏలూరు, అర్బన్‌, బుట్టాయగూడెం: ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలక అంకమైన నామపత్రాల స్వీకరణ మొదలు కావటంతో ఉమ్మడి పశ్చిమలో ఎన్నికల సందడి మొదలైంది. కార్యకర్తల ఉత్సాహం..నాయకుల్లో ఉత్కంఠ నడుమ నామపత్రాల స్వీకరణకు తొలి రోజైన గురువారం పలువురు నేతల నామపత్రాలు దాఖలు చేశారు. వాటితో పాటు వారి స్థిర, చరాస్తుల వివరాలు, క్రిమినల్‌ కేసుల వివరాలతో అఫిడవిట్‌లు సమర్పించారు. మొదటి రోజు దాఖలైన నామపత్రాలు పరిశీలిస్తే..ప్రధాన పార్టీలైన తెదేపా, వైకాపా నుంచి ఒక్కొక్క నామపత్రం దాఖలైంది. ఏలూరు నియోజకవర్గం వైకాపా అభ్యర్థి, మాజీ మంత్రి ఆళ్ల నాని, పోలవరం కూటమి అభ్యర్థి చిర్రి బాలరాజు నామినేషన్‌ దాఖలు చేశారు. వారు అఫిడవిట్‌లో పొందుపరిచిన వివరాలు ఇలా ఉన్నాయి.


ఏలూరులో దాఖలు చేస్తున్న ఆళ్ల నాని

అభ్యర్థి పేరు: ఆళ్ల నాని
పార్టీ: వైకాపా
విద్యార్హతలు: ఇంటర్‌, బీకాం (మధ్యలో ఆపేశారు)
కేసులు: ఏమీ లేవు
చరాస్తుల విలువ మొత్తం: రూ.1,39,96,885.
భార్య పేరిట రూ.72,69,897
స్థిరాస్తి విలువ మొత్తం:రూ.55,60,650. భార్య పేరిట రూ.5,92,29,200
సొంత ఇంటి విలువ: రూ.2,00,22,000. భార్య పేరున రూ.6,20,54,000
బంగారం విలువ: రూ.4,55,000. భార్య పేరున రూ.47,25,000
అప్పులు: రూ.27,51,846. భార్య పేరున రూ.9,45,100
వాహనాలు: టయోటా కారు విలువ రూ.32,31,000.
వాల్వో కారు విలువ రూ.83,60,000. భార్య తరఫున మహేంద్రా స్కార్పియో విలువ రూ.16,81,301. ఇసుజు డీ-మ్యాక్స్‌ క్రూ విలువ రూ.8,71,047


కేఆర్‌పురంలో నామపత్రం అందిస్తున్న చిర్రి బాలరాజు


అభ్యర్థి: చిర్రి బాలరాజు, పార్టీ: జనసేన
విద్యార్హతలు: డిగ్రీ బీఏ, కేసులు: ఏమీ లేవు
చరాస్తుల విలువ: రూ.17,08,164
బంగారం: 72 గ్రాములు, స్థిరాస్తి విలువ:
రూ.34,93,500, బీ భార్యకు తాటియాకులగూడెంలో రూ.3.5 లక్షల విలువైన స్థలం, బర్రింకలపాడులో రూ.29,43,500 విలువైన ఉమ్మడి భూమి ఉంది.  అప్పులు: రూ.3,15,500

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు