logo

వైకాపాకు ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తొస్తారు : నిమ్మల

కొవిడ్‌-19 సమయంలో ప్రజలు ప్రాణభయంతో ఉన్నప్పుడు 2022లో గోదావరి వరదలొచ్చి ఊళ్లన్నీ నీటమునిగినప్పుడు

Updated : 19 Apr 2024 04:33 IST

  మాట్లాడుతున్న రామానాయుడు

పాలకొల్లు, న్యూస్‌టుడే: కొవిడ్‌-19 సమయంలో ప్రజలు ప్రాణభయంతో ఉన్నప్పుడు 2022లో గోదావరి వరదలొచ్చి ఊళ్లన్నీ నీటమునిగినప్పుడు గుర్తుకురాని ప్రజలు వైకాపా నాయకులకు ఎన్నికలొచ్చినప్పుడు మాత్రం గుర్తుకురావడం విచిత్రమని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. ఆయన కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పదేళ్లుగా ప్రజల్లోనే ఉంటున్న తనకు మాత్రమే పాలకొల్లు నియోజకవర్గంలో ఓటు అడిగే హక్కు ఉందన్నారు. ధాన్యం కొనేవారులేక రైతులు రోజుల తరబడి రోడ్లపైనే ఉన్నపుడు సైతం ఒక్క వైకాపా నాయకుడు రాలేదని గుర్తుచేశారు. ఇప్పటివరకు రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసిన తాను మిగిలిన 10శాతం పనులను పూర్తిచేయడంతోపాటు పాలకొల్లును రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దడానికి మరోసారి అవకాశం అడుగుతున్నట్లు చెప్పారు. శుక్రవారం ఉదయం 8గంటలకు పూలపల్లి నుంచి సైకిల్‌పై ర్యాలీగా బయల్దేరి వెళ్లి తాను నామినేషన్‌ వేస్తున్నందున నియోజకవర్గంలోని తెదేపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధికసంఖ్యలో మద్దతుగా తరలిరావాలని ఆయన కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని