logo

తొలి రోజు ఒక్కటే నామినేషన్‌

నామపత్రాల దాఖలు ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. తొలి రోజు పశ్చిమగోదావరి జిల్లాలో ఒకే ఒక్క నామినేషన్‌ దాఖలైంది.

Published : 19 Apr 2024 05:02 IST

అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిల్‌

కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న అధికారులు

భీమవరం అర్బన్‌, న్యూస్‌టుడే: నామపత్రాల దాఖలు ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. తొలి రోజు పశ్చిమగోదావరి జిల్లాలో ఒకే ఒక్క నామినేషన్‌ దాఖలైంది. నరసాపురం పార్లమెంటు అభ్యర్థిగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి అత్తిలి మండలం ఆరవల్లికి చెందిన సత్తి సూర్యనారాయణరెడ్డి ఒక సెట్‌ దరఖాస్తును కలెక్టరు సుమిత్‌కుమార్‌కు అందజేశారు. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కడా నామినేషన్లు దాఖలు కాలేదని కలెక్టర్‌ తెలిపారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ఎక్కువ మంది శుక్రవారం నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు.

రంగంలోకి ఎన్నికల వ్యయ పరిశీలకులు.. ఎన్నికల సంఘం జిల్లాకు నియమించిన వ్యయ పరిశీలకులు పీయూష్‌ శుక్లా, మోహన్‌అగర్వాల్‌, విక్రమాదిత్య మీనా గురువారం భీమవరం వచ్చారు. తొలుత కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ను కలిసి పలు అంశాలపై చర్చించారు. అనంతరం కలెక్టరేట్‌లో కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాన్ని, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని విభాగాలను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంయుక్త కలెక్టర్‌ ప్రవీణ్‌ఆదిత్య, శిక్షణ ఉప కలెక్టర్‌ సంగీత్‌మాధుర్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు