logo

ప్రచారం తప్ప.. ప్రగతి లేదు

భీమవరం ఏడో వార్డు పరిధి మారుతీనగర్‌లో గత అయిదేళ్లలో అభివృద్ధి జాడలు కనిపించడంలేదు. గత పాలకమండలి హయాంలో ఆమోదం పొందిన పనులకు మళ్లీ టెండర్లు పిలిచి చేసినవి మినహా కొత్తగా చేపట్టినవి లేవు.

Published : 20 Apr 2024 06:00 IST

అర్ధాంతరంగా నిలిచిన నిర్మాణాలు

మారుతీనగర్‌లోని అంతర్గత రహదారుల్లో కొన్ని ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోలేదు. ఎన్నికల నియమావళి అమలుకు కొద్దిరోజులు ముందు కొన్నిచోట్ల పనులు ప్రారంభించారు.

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: భీమవరం ఏడో వార్డు పరిధి మారుతీనగర్‌లో గత అయిదేళ్లలో అభివృద్ధి జాడలు కనిపించడంలేదు. గత పాలకమండలి హయాంలో ఆమోదం పొందిన పనులకు మళ్లీ టెండర్లు పిలిచి చేసినవి మినహా కొత్తగా చేపట్టినవి లేవు. గతంలో చేపట్టిన పనులు కూడా అర్ధాంతరంగా నిలిచిపోవడంపై స్థానికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

  • ఈ కాలనీలో 3.70 ఎకరాల విస్తీర్ణంలో పార్కు ఉంది. తెదేపా హయాంలో అప్పటి పాలకమండలి రక్షణ గోడ నిర్మాణం చేసింది. ఏపీ అర్బన్‌ గ్రీనరీ బ్యూటిఫికేషన్‌ ఆధ్వర్యంలో రూ.1.50 కోట్లతో పార్కు ఆధునీకీకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కొత్త ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత ఆ ఊసే మరిచారు.
  • డ్రెయిన్లు, రహదారుల అభివృద్ధికి గతంలో రూ. 2.5 కోట్లు విడుదలయ్యాయి. వాటిని సద్వినియోగం చేయకపోవడంతో అభివృద్ధి నిలిచింది. కొత్తగా ప్రతిపాదనలు లేకపోవడంతో వర్షాకాలంలో రహదారులు కొన్ని నీట మునుగుతున్నాయి.

అసలే చెత్త.. ఆపై పొగ

గొల్లవానితిప్ప రోడ్డుపై కమ్మేసిన పొగ

భీమవరం పట్టణంలో సేకరించే చెత్త, వ్యర్థాలను యనమదుర్రు డ్రెయిన్‌ గట్లపై గుట్టలుగా పోసి తరచూ నిప్పు పెడుతున్నారు. వాటినుంచి వెలువడే పొగతో ఉక్కిరిబిక్కిరవుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క వ్యర్థాలన్నీ క్రమంగా డ్రెయిన్లోకి చేరి పూడిక ఏర్పడుతోంది. జిల్లా కేంద్రమైన భీమవరానికి దూరంగా డంపింగ్‌యార్డును ఏర్పాటుచేసి ప్రజారోగ్యాన్ని, పర్యావరణాన్ని కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

ఈనాడు, భీమవరం


ముంపుతో ఇబ్బందులు

దాదాపు 24 ఏళ్ల క్రితం ఈ కాలనీ ఏర్పడింది. ఇప్పటికీ గ్రామీణ ఛాయలే కనిపిస్తాయి. ఇటీవల భవన నిర్మాణాలు జోరందుకున్నాయి. జిల్లా కేంద్రంగా భీమవరం ఏర్పడటం, ఈ ప్రాంతంలో కలెక్టరేట్‌ కార్యాలయం ఉండటంతో రహదారులు రద్దీగా మారాయి. వర్షాకాలంలో ముంపు ఇబ్బందులు వెంటాడుతున్నాయి. శాశ్వత ప్రణాళికతో అభివృద్ధి జరగాలి.

జి.సుబ్బారావు, స్థానికుడు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని