logo

రాష్ట్రమంతటా కూటమి పవనాలు

వచ్చే ఎన్నికల్లో కూటమిదే విజయమని అన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ పేర్కొన్నారు.

Published : 20 Apr 2024 06:04 IST

జగన్‌ గెలిచే అవకాశం లేదు: ఎంపీ రఘురామ

ఈనాడు డిజిటల్‌, భీమవరం, కాళ్ల, న్యూస్‌టుడే: వచ్చే ఎన్నికల్లో కూటమిదే విజయమని అన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ పేర్కొన్నారు. ‘రచ్చబండ’ కార్యక్రమంలో భాగంగా  పెదఅమిరంలోని తన కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. ‘జగన్‌మోహన్‌రెడ్డి గెలిచే అవకాశం లేదు. గతంలో చేసిన తప్పును ప్రజలు మళ్లీ చేయరు. రాష్ట్రమంతటా కూటమి పవనాలు వీస్తున్నాయి. తెదేపా అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్‌కల్యాణ్‌ నిర్వహిస్తున్న సభలు ప్రజలతో కిక్కిరిసిపోతుంటే, జగన్‌ సభలు మాత్రం వెలవెలబోతున్నాయి. భీమవరం బహిరంగ సభ బస్సులెక్కువ.. జనం తక్కువ అన్నట్లు తయారైంది. గులకరాయి డ్రామా రక్తికట్టలేదు. ఎన్నికలు సజావుగా జరగాలంటే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌), డీజీపీ, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ను తక్షణమే బదిలీ చేయాలి. వారిపై వచ్చిన ఆరోపణలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తా. ఇటీవల కొందరు ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేసినా పోలీసుల పనితీరులో మార్పు కనిపించడం లేదు’ అని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని