logo

పుట్టెడు దుఃఖంలోనూ అవయవదానం!

భౌతికంగా తమ కుమారుడు మృతిచెందినా అవయవదానంతో మరొకరిలో చిరంజీవిగా జీవించే ఉంటాడని భావించిన ఆ తల్లిదండ్రులు పుట్టెడు దుఃఖంలోనూ అవయవదానానికి అంగీకరించి స్ఫూర్తిదాయకంగా నిలిచారు.

Updated : 19 May 2024 07:27 IST

స్ఫూర్తిదాయకంగా మృతుడి తల్లిదండ్రుల నిర్ణయం
అంతిమయాత్రలో భారీగా పాల్గొన్న గ్రామస్థులు 

పవన్‌కుమార్‌ (పాతచిత్రం)

యలమంచిలి, న్యూస్‌టుడే: భౌతికంగా తమ కుమారుడు మృతిచెందినా అవయవదానంతో మరొకరిలో చిరంజీవిగా జీవించే ఉంటాడని భావించిన ఆ తల్లిదండ్రులు పుట్టెడు దుఃఖంలోనూ అవయవదానానికి అంగీకరించి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. యలమంచిలి మండలం ఇలపకుర్రు పరిధిలోని కుమ్మరిపాలేనికి చెందిన కాండ్రేగుల పవన్‌కుమార్‌ (19) ఈ నెల 1న ఇంటి దగ్గర కొబ్బరిచెట్టు విరిగిపడటంతో తీవ్రంగా గాయపడ్డారు. అతడిని విశాఖ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం (బ్రెయిన్‌డెడ్‌) మృతి    చెందిన విషయం విదితమే. కుమారుడి అవయవాలు దానం చేస్తే అవి అవసరమైన మరొకరికి ప్రాణం పోస్తాయని మృతుడి తల్లిదండ్రులు శ్రీనివాసరావు, శ్రీదేవి పవన్‌కుమార్‌ భావించారు. పుట్టెడు దుఃఖంలోనూ కుమారుడి అవయవాలను విశాఖ కిమ్స్‌లో దానం చేశారు. అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చి దొడ్డిపట్ల గోదావరి తీరంలో శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. పవన్‌కుమార్‌ అంతిమయాత్రకు ఇలపకుర్రు, దొడ్డిపట్ల చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది తరలివచ్చారు. జోహార్‌ పవన్‌కుమార్‌ అంటూ నినాదాలు చేస్తూ అంత్యక్రియలు పూర్తిచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని