logo

రోజుకు రూ.20 వేతనం

ఎన్నికల విధుల్లో పాల్గొన్న తమకు రోజుకు రూ.20 వేతనం కేటాయించడంతో సిబ్బంది షాక్‌కు గురయ్యారు.

Published : 21 May 2024 03:10 IST

కంగుతిన్న ఎన్నికల సిబ్బంది

ఉంగుటూరు, న్యూస్‌టుడే: ఎన్నికల విధుల్లో పాల్గొన్న తమకు రోజుకు రూ.20 వేతనం కేటాయించడంతో సిబ్బంది షాక్‌కు గురయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నగదు, బంగారం, మద్యం తదితరాల రవాణాను అడ్డుకునేందుకు   స్టాటిక్‌ సర్వేలెన్స్‌ బృందాలు (ఎస్‌ఎస్‌టీ), ఫ్లయింగ్‌ సర్వేలెన్స్‌ బృందాలను (ఎఫ్‌ఎస్‌టీ) ఏర్పాటు చేశారు. ఉంగుటూరు నియోజకవర్గంలోని ఒక్కో మండలానికి రెండేసి చొప్పున 8 ఎస్‌ఎస్‌టీ, 8 ఎఫ్‌ఎస్‌టీలను నియమించారు. వీటిల్లో వివిధ హోదాల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులున్నారు. దాదాపు రెండు నెలల పాటు రోజుకు 12 గంటల చొప్పున పని చేశారు. వీరు వేతనం కోసం సోమవారం ఉంగుటూరు తహసీల్దారు కార్యాలయానికి వచ్చారు. అక్కడి అధికారులు రూ.1200 చొప్పున చెల్లిస్తామని చెప్పడంతో కంగుతిన్నారు. దాదాపు 59 రోజులు పని చేశామని.. రూ.1200 ఇస్తే ఎలా అంటూ వాపోయారు. రోజుకు రూ.20 చొప్పున పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తహసీల్దారు కట్టా వెంకట శివయ్య మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల్లో రూ.1200 అని ఉందని, విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని