logo

పెనుగొండ యువతికి ప్రశంస

పెనుగొండకు చెందిన మహ్మద్‌ నర్గీస్, ఆరీఫ్‌ మహ్మద్‌ దంపతుల పెద్ద కుమార్తె మహ్మద్‌ రుక్సార్‌ శనివారం రాత్రి అమెరికాలోని బర్కిలీ అంతర్జాతీయ పాఠశాలలో జరిగిన ఎంసీబీ విద్యార్థుల 2024 ప్రారంభోత్సవ సమావేశంలో

Updated : 21 May 2024 06:10 IST

ప్రసంగిస్నున్న మహ్మద్‌ రుక్సార్‌

పెనుగొండ, న్యూస్‌టుడే:  పెనుగొండకు చెందిన మహ్మద్‌ నర్గీస్, ఆరీఫ్‌ మహ్మద్‌ దంపతుల పెద్ద కుమార్తె మహ్మద్‌ రుక్సార్‌ శనివారం రాత్రి అమెరికాలోని బర్కిలీ అంతర్జాతీయ పాఠశాలలో జరిగిన ఎంసీబీ విద్యార్థుల 2024 ప్రారంభోత్సవ సమావేశంలో ఇద్దరు నోబుల్‌ అవార్డు గ్రహీతల సమక్షంలో వైద్య రంగంలో పలు అంశాలపై చేసిన ప్రసంగం ఆకట్టుకుంది. ఈ సమావేశంలో పాల్గొన్న నోబుల్‌ అవార్డుగ్రహీతలు డేవిడ్‌ జూలియస్, రాంఢీ స్కెక్మాన్‌లు ఆమెను అభినందించారు. రుక్సార్‌ యూసీ బర్కిలీ స్కూల్‌ ఆఫ్‌ ఆప్టోమెట్రిలో మూడేళ్లు రీసెర్చి అసిస్టెంట్‌గా కొనసాగారు. పీజీ మెడికల్‌ అసిస్టెంట్‌ శిక్షణ అనంతరం వైద్య పాఠశాలలో చేరి వైద్య వృత్తిలో ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని రుక్సార్‌ ఆశిస్తున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని