logo

రోగులకు పరీక్షే!

అనారోగ్యంతో ఆసుపత్రికొస్తే అక్కడ ఓపీ చీటీ రాయించుకోవాలంటే ఆధార్‌నంబరుతో అనుసంధానం చేసిన చరవాణి ఉందా అని అడుగుతున్నారు.

Published : 21 May 2024 03:21 IST

మాతాశిశు విభాగంలో ఉక్కపోతతో అవస్థలు పడుతూ నిరీక్షిస్తున్న గర్భిణులు, అక్కడ ఫ్యాన్‌ ఇలా.. 

అనారోగ్యంతో ఆసుపత్రికొస్తే అక్కడ ఓపీ చీటీ రాయించుకోవాలంటే ఆధార్‌నంబరుతో అనుసంధానం చేసిన చరవాణి ఉందా అని అడుగుతున్నారు. కనీసం మామూలు ఫోనైనా ఉంటే వివరాలు రాసుకొని దానికి ఓటీపీ పంపిస్తున్నారు. ఓటీపీతో వచ్చిన టోకెన్‌ నంబరు చెబితే ఓపీ చీటీ ఇస్తున్నారు. పలుమార్లు సర్వరు మొరాయిస్తుండటంతో మరింత జాప్యం ఏర్పడుతోంది. ఈ తతంగమంతా తెలియని రోగులు అయోమయానికి గురై నిరీక్షిస్తున్నారు. గతంలో మాదిరిగా రోగి వివరాలు రాసుకొని ఓపీ ఇవ్వాలని కోరుతున్నారు. సోమవారం ఏలూరులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని పరిశీలిస్తే ఓపీ మొదలుకొని అన్ని విభాగాల చెంత రోగులు గంటల తరబడి నిరీక్షిస్తూ కనిపించారు. మాతా శిశు విభాగంలోని నెలవారీ పరీక్షల కోసం వచ్చిన గర్భిణులు గంటల తరబడి నిరీక్షించారు. అక్కడ కనీసం ఫ్యాన్లు కూడా లేకపోవడంతో ఉక్కపోతతో అవస్థలు పడ్డారు.

ఈనాడు, ఏలూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని