logo

సహకరిస్తే.. అండగా నిలుస్తాం

ఓఎన్‌జీసీ పైపులైను వెళ్లే గ్రామాలకు ప్రత్యేక నిధులు మంజూరు చేయించి న్యాయం చేస్తామని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ తెలిపారు.

Published : 21 May 2024 03:42 IST

పైపులైను ఏర్పాటుపై రైతులతో కలెక్టర్‌ చర్చలు 

సుమిత్‌కుమార్‌

భీమవరం అర్బన్, నరసాపురం గ్రామీణ, న్యూస్‌టుడే: ఓఎన్‌జీసీ పైపులైను వెళ్లే గ్రామాలకు ప్రత్యేక నిధులు మంజూరు చేయించి న్యాయం చేస్తామని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ తెలిపారు. సీతారాంపురం సౌత్, యర్రంశెట్టివారిపాలెం, రుస్తుంబాద గ్రామాల రైతులు, ఓఎన్‌జీసీ ప్రతినిధులతో ఆయన కలెక్టరేట్‌లో సోమవారం సమావేశం నిర్వహించారు. అవగాహన లేకుండా ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేయొద్దని.. సంబంధిత గ్రామాలను అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. అభివృద్ధికి సహకరిస్తే అండగా ఉంటామని రైతులకు భరోసా ఇచ్చారు. మూడున్నర మీటర్ల వెడల్పు ఉన్న పైపులను 3.2 కిలోమీటర్ల మేర వేస్తారని పేర్కొన్నారు. ఈ పైపులైను వెళ్లే మూడు గ్రామాలకు రూ.15 లక్షల చొప్పున మొత్తం రూ.45 లక్షలను ఓఎన్‌జీసీ ద్వారా మంజూరు చేయిస్తామని తెలిపారు. గ్రామస్థుల సందేహాలను నివృత్తి చేశారు. జేసీ ప్రవీణ్‌ఆదిత్య, డీఆర్వో ఉదయభాస్కర్‌ తదితర అధికారులతోపాటు సీతారాంపురం సౌత్‌ సర్పంచి దొండపాటి వెంకట్, రైతులు హరికృష్ణ, రవీంద్ర, చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని