logo

ఇసుక ర్యాంపుల తనిఖీ

జిల్లాలోని ఆచంట మండలం పరిధిలోని కోడేరు, కరుగోరుమిల్లి ఇసుక ర్యాంపులను సోమవారం జిల్లా అధికారుల బృందం ఆకస్మికంగా తనిఖీ చేసింది.

Published : 21 May 2024 03:44 IST

కరుగోరుమిల్లి గోదావరి తీరంలో అధికారులు

ఆచంట, న్యూస్‌టుడే:  జిల్లాలోని ఆచంట మండలం పరిధిలోని కోడేరు, కరుగోరుమిల్లి ఇసుక ర్యాంపులను సోమవారం జిల్లా అధికారుల బృందం ఆకస్మికంగా తనిఖీ చేసింది. ఇసుక తవ్వకాలు, అక్రమ రవాణాకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా గనుల శాఖ అధికారి జి.జయ ప్రసాద్, అసిస్టెంట్ ఎన్ఫోర్స్‌మెంట్ సూపరింటెండెంట్‌ ఆర్‌.సీˆహెచ్‌.చిట్టిబాబు, పర్యావరణ ఇంజినీరు కె.వెంకటేశ్వరరావు, వీఆర్‌బీ ఏఈ కేవీ సుబ్బారావు, ఏఈఈ జీడీ పవన్‌ కుమార్, భూగర్భ జలశాఖ నుంచి సాంకేతిక అధికారి ఎన్‌.మోహన్‌ శ్రీ వెంకటేష్, మైన్స్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.శివలీలా రాణి, ఎస్‌ఈబీ ఇన్‌స్పెక్టర్‌ జేవీ భవాని, ఆచంట ఎస్సై ఎం.రాజ్‌కుమార్, ఆర్‌ఐ సీˆహెచ్‌ జయలలిత పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని