logo

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

మన్యంలోని ఫీడర్‌ అంబులెన్స్‌ల పైలెట్లు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని జిల్లా మలేరియా నివారణ ఇన్‌ఛార్జి అధికారి, కేఆర్‌పురం ఇన్‌ఛార్జి డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ జె.సురేశ్‌కుమార్‌ హెచ్చరించారు.

Published : 22 May 2024 05:29 IST

బుట్టాయగూడెం, న్యూస్‌టుడే: మన్యంలోని ఫీడర్‌ అంబులెన్స్‌ల పైలెట్లు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని జిల్లా మలేరియా నివారణ ఇన్‌ఛార్జి అధికారి, కేఆర్‌పురం ఇన్‌ఛార్జి డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ జె.సురేశ్‌కుమార్‌ హెచ్చరించారు. ‘అత్యవసర సేవ.. నిర్లక్ష్య తోవ!’ శీర్షికన సోమవారం ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. కేఆర్‌పురం ఐటీడీఏ వద్ద మన్యం మండలాల్లోని ఫీడర్‌ అంబులెన్స్‌ల పైలెట్లతో మంగళవారం సమీక్షించారు. కుక్కునూరు, వేలేరుపాడుకు అదనంగా ఒక్కో ఫీడర్‌ అంబులెన్స్‌ కేటాయించేందుకు ప్రతిపాదనలు పంపనున్నట్లు చెప్పారు. అత్యవసర సమయంలో సమాచారం అందేలా.. మారుమూల గ్రామాల ప్రజలకు పైలెట్లు తమ ఫోన్‌ నంబరు తెలియజేయాలన్నారు. గర్భిణుల ఎంసీహెచ్‌ రిజిస్టర్‌లో తప్పనిసరిగా ఫోన్‌ నంబరు నమోదు చేయాలని దిశానిర్దేశం చేశారు. ఫీడర్‌ అంబులెన్స్‌ల పర్యవేక్షకుడు శ్రీనివాస్, మలేరియా సబ్‌ యూనిట్‌ అధికారి శ్రీరామరాజు తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని