logo

నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందే!

ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆర్వోలకు కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ సూచించారు. ఆయన ఎస్పీ అజితతో కలిసి ఆర్వోలతో మంగళవారం సమీక్ష నిర్వహించారు.

Published : 22 May 2024 05:57 IST

మాట్లాడుతున్న కలెక్టర్‌ సుమిత్‌కుమార్, పక్కన ఎస్పీ, జేసీ

భీమవరం అర్బన్, న్యూస్‌టుడే: ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆర్వోలకు కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ సూచించారు. ఆయన ఎస్పీ అజితతో కలిసి ఆర్వోలతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. లెక్కింపు కేంద్రాల్లోకి చరవాణులకు అనుమతి ఉండదన్నారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల సంఘం నిబంధనలను కచ్చితంగా పాటించి తీరాలన్నారు. సంబంధిత సిబ్బందిని తప్ప లెక్కింపు కేంద్రాల్లోకి ఎవరినీ అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ప్రధాన ఎన్నికల అధికారికి తక్షణం సమాచారం పంపేందుకు అత్యంత వేగంగా ఉండే అంతర్జాలం, ఫ్యాక్స్, ప్రింటర్లు, ఎస్టీడీ సౌకర్యాలను ఏర్పాటు చేయాలన్నారు. పరిశీలకుల గదిలో, మీడియా కేంద్రంలో అవసరమైన సౌకర్యాలు కల్పించాలన్నారు.  

బాణసంచా తయారీ, విక్రయాలపై నిషేధం..  ఎస్పీ అజిత మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా డబ్బాల ద్వారా ఇంధన విక్రయాలు నిషేధించామని.. తప్పనిసరి పరిస్థితి అయితే తహసీల్దార్‌ అనుమతి పొందాలన్నారు. బాణసంచా తయారీ, రవాణాపైనా నిషేధాజ్ఞలు ఉన్నాయన్నారు. సంయుక్త కలెక్టర్‌ ప్రవీణ్‌ఆదిత్య, డీఆర్వో ఉదయభాస్కరరావు, అదనపు ఎస్పీ భీమారావు పాల్గొన్నారు.

తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు..జిల్లాలో తాగునీరు, విద్యుత్తు సరఫరా, గ్రామీణ ఉపాధి హామీ పనులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టినట్లు కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి మంగళవారం వర్చువల్‌గా నిర్వహించిన సమీక్షలో ఆయన కలెక్టరేట్‌ నుంచి పాల్గొన్నారు.  
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని