logo

జలసిరికి దారేదీ?

ఉండిలో పడవల రేవు వద్ద ప్రధాన పంట కాలువ దుస్థితిది. ఇక్కడ ఆరేళ్ల కిందట కొత్త వంతెన నిర్మించారు. ఆ సమయంలో కాలువలో చేరిన మట్టి, ఇతర వ్యర్థాల తొలగింపు పనులు ఇప్పటికీ చేపట్టలేదు

Published : 22 May 2024 06:04 IST

ప్రక్షాళనకు నోచుకోని పంట కాలువలు
ప్రవాహానికి అడుగడుగునా అవరోధాలే

ఉండిలో పడవల రేవు వద్ద ప్రధాన పంట కాలువ దుస్థితిది. ఇక్కడ ఆరేళ్ల కిందట కొత్త వంతెన నిర్మించారు. ఆ సమయంలో కాలువలో చేరిన మట్టి, ఇతర వ్యర్థాల తొలగింపు పనులు ఇప్పటికీ చేపట్టలేదు. దీంతో సాగునీటి ప్రవాహానికి ఏడాది పొడవునా అవరోధాలు ఎదురవుతున్నాయి. 

భీమవరం వ్యవసాయ విభాగం, న్యూస్‌టుడే : గోదావరి డెల్టాలో 5,29,320 ఎకరాల విస్తీర్ణంలో వరి, ఇతర పంటలు, దాదాపు 1.5 లక్షల ఎకరాల ఆక్వా చెరువులకు, వందలాది గ్రామాల తాగునీటి అవసరాలకు ప్రధాన ఆధారమైన పంట కాలువల వ్యవస్థ పాలకుల నిర్లక్ష్యంతో అస్తవ్యస్తంగా మారుతోంది.  ఆక్రమణలకు తోడు తూడు తొలగింపు, ఇతర నిర్వహణ పనులు చేపట్టకపోవడంతో శివారు ప్రాంతాలకు నీరు చేరక ఏటా రబీ సీజన్లో అన్నదాతలకు అవస్థలు తప్పడం లేదు.

కరెంటు బిల్లులను ముక్కుపిండి వసూలు చేసే యంత్రాంగం వినియోగదారులకు నాణ్యమైన సరఫరాలో ఘోరంగా వైఫల్యం చెందుతోంది. అవసరాలకు అనుగుణంగా పరివర్తకాలు, ఉపకేంద్రాల ఏర్పాటులో నిర్లక్ష్యం వహిస్తోంది. దీంతో గ్రామాల్లో లోవోల్టేజీ సమస్య జటిలంగా మారింది. వేసవిలోనే కాదు సాధారణ రోజుల్లోనూ ఈ పరిస్థితి ఉండటం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. తరచూ ఛార్జీలు పెంచిన ప్రభుత్వం సిబ్బంది నియామకం, గ్రామాల్లో నిర్వహణ పనులపై శ్రద్ధ చూపడం లేదు.   జిల్లాలో మూడో వంతు గ్రామాల్లో వివిధ రూపాల్లో విద్యుత్తు సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. 
రి నీటి విడుదల ఆపేసి 12 రోజులు గడిచినా మహదేవపట్నం ప్రాంతంలో ప్రధాన పంట కాలువలో నాలుగైదు   అడుగులకు మించి జలాలు ఉన్నాయి. మరోపక్క ఆక్వా  చెరువుల్లో వ్యర్థ జలాలు కూడా ఈ కాలువలోకే చేరుతున్నాయని స్థానిక రైతులు చెబుతున్నారు.

దాదాపు అన్ని ప్రాంతాల్లో కాలువల వెంనిర్వహణ ఊసే లేదు..బడి ఆక్రమణలు ఏటేటా పెరుగుతూనే ఉన్నాయి. దీంతో కాలువల వెడల్పు తగ్గిపోతోంది. కొన్ని ప్రాంతాల్లో పంట బోదెలు కనుమరుగయ్యాయి. సాధారణంగా ఏటా వేసవిలో (క్లోజర్‌ పిరియడ్‌) కాలువల ప్రక్షాళన పనులు చేపడుతుంటారు. నాలుగేళ్ల నుంచి మొక్కుబడి పనులతో సరిపెడుతున్నారు. ఓఅండ్‌ఎం (నిర్వహణ) నిధులతో తూడు, గుర్రపుడెక్క తొలగింపు పనులను వివిధ దశల్లో వడపోసి.. అనుమతులిచ్చే సరికి కాలువలకు నీరొదిలేస్తున్నారు. ఎన్నికల ఏడాది అని తెలిసినా ఓఅండ్‌ఎం పనులపై ముందస్తు ప్రణాళిక లేకుండా పోయింది. ఈ నెల పదో తేదీనే సరఫరా నిలిపివేసినా ప్రధాన కాలువల్లో కూడా ఇప్పటికీ నాలుగైదు అడుగులకు మించి నీరు ప్రవహిస్తోంది. మధ్యమధ్యలో కురుస్తున్న వర్షాలు నీటి మట్టాన్ని పెంచేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాలువలు ఆరే అవకాశాలు మృగ్యమనే చెప్పొచ్చు. మరోపక్క ఆంగ్లేయుల కాలం నాటి లాకులు, వియర్లు, ఆప్‌టేక్, ఇన్‌లెట్‌ స్లూయిజ్‌ల్లో వివిధ కట్టడాలు శిథిలావస్థకు చేరాయి. గట్టిగా వర్షాలు కురిస్తే డెల్టా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతోంది.

మురుగు కాలువలదీ ఇదే పరిస్థితి..

డెల్టాలో 21 మేజర్, 59 మీడియం, 579 మైనర్‌ డ్రెయిన్లు ఉన్నాయి. వీటితో పాటు కొల్లేరులో మురుగంతా ఉప్పుటేరులో కలవాలి. ఆధునికీకరణలో డ్రెయిన్ల ప్రక్షాళన పనులు పూర్తిస్థాయిలో చేపట్టలేదు. గత అయిదేళ్లుగా నిర్వహణ పనులు నీరు గారిపోయాయి. ఆక్రమణల సంఖ్య పెరిగిపోవడంతో డ్రెయిన్ల సామర్థ్యం బాగా తగ్గిపోయింది. డ్రెయిన్‌ గట్లను ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నా యంత్రాంగం పట్టించుకోవడంలేదనే ఆరోపణలున్నాయి. వేసవిలో చేపట్టాల్సిన తూడు, గుర్రపుడెక్క తొలగింపు పనులు ఇప్పటికీ ప్రారంభం కాకపోవడంతో ఖరీఫ్‌ సీజన్లో ఎలాంటి పరిస్థితి చవిచూడాల్సి వస్తుందోననే ఆందోళన సాగుదారుల్లో వ్యక్తమవుతోంది. నిర్వహణ పనులకు ప్రతిపాదనలను ముందుగానే పంపామని.. ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉందని జలవనరుల శాఖ అధికారులు వివరిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని