logo

ప్రయాస ప్రాంగణం..!

అభివృద్ధి పథంలో నడుస్తున్న తణుకు ఆర్టీసీ బస్టాండ్‌లో  ప్రయాణికులను పలు సమస్యలు వేధిస్తున్నాయి. 

Updated : 24 May 2024 05:18 IST

తణుకు ఆర్టీసీ బస్టాండ్‌లో సమస్యలు కోకొల్లలు

వర్షం వస్తే.. జలమయమై ఇలా.. 

అభివృద్ధి పథంలో నడుస్తున్న తణుకు ఆర్టీసీ బస్టాండ్‌లో  ప్రయాణికులను పలు సమస్యలు వేధిస్తున్నాయి. 

తణుకు, న్యూస్‌టుడే

  • హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు, తిరుపతి, రాయచూరు, సింధనూరు, చెన్నై, విజయవాడ వంటి ప్రాంతాలకు నిత్యం తణుకు నుంచి సర్వీసులు ఉంటాయి.

కనీస సదుపాయాలు కరవు..

  • ఆర్టీసీ బస్టాండ్‌లో తాగునీటి సదుపాయం లేదు. ఫౌంటెన్‌ ఏర్పాటు చేసినా అక్కడ అపరిశుభ్ర వాతావరణం నెలకొంటోంది. కుళాయి నీరు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. గ్యారేజ్‌ ఆవరణలో రక్షిత తాగునీటి ప్లాంట్‌ ఉన్నా ప్రయాణికులకు మాత్రం ఉపయోగపడటం లేదు.
  • బస్టాండ్‌లో మరుగుదొడ్ల  తలుపులు విరిగిపోయి ఉన్నాయి.
  • ప్రయాణికుల సౌకర్యార్థం ఫ్యాన్లు ఉన్నా వాటిలో కొన్ని పని చేయడం లేదు.
  • బస్సుల సమాచారం తెలిపే కేంద్రం కూడా సక్రమంగా పనిచేయడం లేదని  ప్రయాణికులు చెబుతున్నారు.
  • బస్టాండ్‌ను ఆనుకొని ఉన్న ఖాళీ స్థలాల్లో కొద్దిపాటి వర్షానికి నీరు నిల్వ ఉండి దుర్వాసన వెదజల్లుతోంది.

నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు..

బస్టాండ్‌లో తినుబండారాలు, కూల్‌ డ్రింక్స్‌ తదితర స్టాల్స్‌లో నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు విక్రయించి ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తున్నారు. లీటరు తాగునీటి సీసా బయట మార్కెట్‌లో రూ. 20 ఉంటే ఇక్కడ రూ. 22, అర లీటర్‌ కూల్‌ డ్రింక్‌ సీసా రూ. 40 ఉండగా రూ. 45కు విక్రయిస్తున్నారు. టీ రూ.5 ఉంటే రూ. 10, అల్పాహారం రూ. 30 నుంచి రూ. 45 వరకు అమ్ముతున్నారు. బస్టాండ్‌ ఆవరణలోని సైకిల్‌ షెడ్డులో ద్విచక్ర వాహనాలు, సైకిళ్లు నిలిపేందుకు రోజుకు రూ.30 నుంచి రూ. 35 వరకు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. షెడ్లు అధ్వానంగా ఉండటంతో దీనిలో ఉంచిన వాహనాలు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తున్నాయి.  కొద్దిపాటి వర్షం వస్తే వాహనాలు పార్కింగ్‌ చేసే ప్రదేశంలోకి వర్షం వచ్చి బురదమయం అవుతుంది.  

‘‘డిపోలో అధిక ధరలకు తినుబండారాలు విక్రయిస్తే చర్యలు తప్పవు. గతంలో కొంత మందికి నోటీసులు కూడా జారీ చేశాం. బస్టాండ్‌లోని సమస్యలన్నీ త్వరలోనే పరిష్కరిస్తాం’’ అని డిపో ఇన్‌ఛార్జి మేనేజరు పున్నయ్య అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు